Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 30వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు ఓమిక్రాన్ ఎఫెక్ట్..!

ఈ నెల 30వ తేదీ వరకు విద్యా సంస్థలకు సెలవులు పొడిగింపు ఓమిక్రాన్ ఎఫెక్ట్..!
-రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ …30 న మరోసారి సమీక్ష
-ఈనెల 22 వరకు ఆన్ లైన్ క్లాసులు జేఎన్టీయూ
-పాఠశాలల్లో ఆన్ లైన్ క్లాసులపై సందిగ్ధం

వేగంగా పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం విద్యా సంస్థలపైన పడింది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లోనూ వేగంగా వ్యాపిస్తున్నాయి. భారీగా కేసులు నమోదువుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ కారణంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులు కొనసాగుతున్నాయి. అయితే, తెలంగాణ లో ఒక వైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌, మరో వైపు కరోనా పాజిటివ్‌ కేసులతో ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తోంది.

దీంతో..తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30వ తేదీ వరకు సెలవులను పొడిగించాలని నిర్ణయించింది. ఈ రోజుతో ముగియనున్న సెలవులు నెలాఖరు దాకా కొనసాగనున్నాయి. కోవిడ్‌ దృష్ట్యా కొద్దిరోజులు ప్రత్యక్ష తరగతులు వద్దని ప్రభుత్వానికి ఆరోగ్య శాఖ సూచించినట్లు సమాచారం. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే ఆన్ లైన్ బాట పట్టిన ప్రయివేటు విద్యా సంస్థలు బీటెక్, ఎంటెక్, ఫార్మసీ విద్యార్థులకు ఈనెల 22 వరకు ఆన్​లైన్ పాఠాలు చెప్పాలని జేఎన్​టీయూహెచ్ ఆదేశాలు జారీ చేసింది.

అయితే, ఆరోగ్య శాఖ సూచనలను పరిగణలోకి తెలంగాణ ప్రభుత్వం తొలుత ఈ నెల 20వ తేదీ వరకు సెలవులు కొనసాగించాలని భావించినా.. ప్రస్తుత పరిస్థితుల కారణంగా 30వ తేదీ వరకు పొడిగించారు. వైద్య, ఆరోగ్యశాఖ సూచనలపై సీఎం కేసీఆర్‌తో చర్చించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు సీఎస్.. అయితే, సెలవులను 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్టు స్పష్టం చేశారు సీఎస్‌.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు మొత్తం.. 30వ తేదీ వరకు మూతపడనున్నాయి.

అయితే, ఆన్ లైన్ క్లాసులు కొనసాగుతాయా లేదా అనేది మాత్రం మరింత స్పష్టత రావాల్సి ఉంది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పిల్లల గురించి తల్లి తండ్రుల్లో ఆందోళన తొలిగింది. అయితే, కేసుల ఆధారంగానే నెలాఖరున రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచన చేసే అవకాశం ఉంది. ఈ నెల30వ తేదీ నాటికి రాష్ట్రంలో పరిస్థితులను పరిగణలోకి తీసుకొని నిర్ణయం ప్రకటించనున్నారు. ఇక, ఇదే సమయంలో 15-18 ఏళ్ల ఏజ్ గ్రూపు వారికి వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసారు. ఇప్పుడు ప్రభుత్వం తాజా నిర్ణయాల పైన ఉత్తర్వులు జారీ చేసింది.

 

Related posts

గుజరాత్ లో నింగి నుంచి నేల రాలిన లోహపు బంతులు.. పరీక్షల కోసం ఇస్రోకు తరలింపు!

Drukpadam

రోశయ్య మృతికి ఏపీ అసెంబ్లీ సంతాపం…ఆయన ఆదర్శ ప్రాయుడన్న సీఎం జగన్ !

Drukpadam

అందుకే యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తున్నాం: కేటీఆర్

Drukpadam

Leave a Comment