Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన తాత మధు ప్రమాణం!

ఖమ్మం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన తాత మధు ప్రమాణం
-పలువురు మంత్రులు హాజరు
-మధు చేత ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ అమిణుల్ హసన్ జాఫ్రి

ఖమ్మం స్తానినిక సంస్థల ఎమ్మెల్సీ గా ఎన్నికైన తాత మధు నేడు మండలి చైర్మన్ అమిణుల్ హసన్ జాఫ్రి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసన సభా వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, మినిస్టర్ సత్యవతి రాథోడ్,రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహాచార్యులు ,
పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ,ఎంపీ నామా నాగేశ్వరరావు, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఖమ్మం జిల్లా టిఆర్ఎస్ పార్టీ నేతలు, తదితరులు హాజరయ్యారు ..

మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా పలువురు శుభాకాంక్షలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యుడిగా తాతా మధుసూదన్ గురువారం పదవీ ప్రమాణం స్వీకరం చేశారు. శాసనమండలి ప్రొటెం చైర్మన్ సయ్యద్‌ అమినుల్‌ హసన్‌ జాఫ్రీ తన చాంబర్‌లో పదవీ ప్రమాణం చేయించారు. రాష్ట్ర శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గారు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, హోం శాఖ మంత్రి మహముద్ అలీ గారు, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు, ఎంపీలు నామ నాగేశ్వరరావు గారు, మాలోత్ కవిత, ఎమ్మెల్యేలు గాంధీ, నల్లమోతు భాస్కర్ రావు, ఉపేందర్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, హరిప్రియ నాయక్, రైతు బంధు సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాష్ట్ర శాసనసభ కార్యదర్శి డాక్టర్‌ వీ నరసింహాచార్యులు, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు

Related posts

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వైసీపీ మద్దతు ….?

Drukpadam

ఏపీ అప్పులపై రఘురామకృష్ణరాజు ప్రశ్న.. వివరాలు వెల్లడించిన నిర్మలా సీతారామన్

Ram Narayana

రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ రణరంగం

Drukpadam

Leave a Comment