Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులే నిర్ణయంపై చట్ట సవరణ …హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం !

టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై చట్ట సవరణ చేస్తాం: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం!

  • ప్రభుత్వ వాదనపై పిటిషనర్ తరపు న్యాయవాదుల అభ్యంతరం
  • దేవాదాయ చట్టంలో ప్రత్యేక ఆహ్వానితుల ప్రస్తావనే లేదన్న వైనం
  • ఎమ్మెల్యే భూమన విజ్ఞప్తికి కోర్టు అంగీకారం

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితుల నియామకానికి సంబంధించి త్వరలోనే చట్టాన్ని సవరించబోతున్నట్టు ఏపీ ప్రభుత్వం నిన్న హైకోర్టుకు తెలిపింది. ఈ విషయమై ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నామని, కాబట్టి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరింది. అయితే, ఏపీ ప్రభుత్వ అభ్యర్థనపై పిటిషనర్ తరపు న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు.

నిజానికి దేవాదాయ చట్టంలో ప్రత్యేక ఆహ్వానితులకు సంబంధించిన ప్రస్తావనే లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే 29 మంది టీటీడీ బోర్డు సభ్యులుగా ఉన్నారని, ఇక దీనిని సవరిస్తామని చెప్పడం చట్టవిరుద్ధమని అన్నారు. మరోవైపు, వాదనలు వినిపించేందుకు తనను ప్రతివాదిగా చేర్చుకోవాలన్న తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరెడ్డి వేసిన అనుబంధ పిటిషన్‌కు కోర్టు అంగీకారం తెలుపుతూ తదుపరి విచారణను వచ్చే నెల 15కి వాయిదా వేసింది.

Related posts

ఇది మన రైతుల ఘన విజయం.. సాగు చట్టాల రద్దుపై ప్రతిపక్షాల స్పందన!

Drukpadam

6 గంటల కంటే నిద్ర తగ్గితే.. డయాబెటిస్ ముప్పు!

Drukpadam

భద్రాద్రి మిథిలా స్టేడియంలో అంగరంగ వైభవంగా రాములోరి కళ్యాణం -పులకించిన భక్త జనం!

Drukpadam

Leave a Comment