Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తల్లాడ ,కామేపల్లి ,నేలకొండపల్లి మండలాల్లో డీసీసీబీ అధికారుల జులుం!

తల్లాడ ,కామేపల్లి ,నేలకొండపల్లి మండలాల్లో డీసీసీబీ అధికారుల జులుం!
-రుణాలు చెల్లించలేదని ఇళ్లకు తాళాలు..వస్తువుల జప్తు..
-చలిలో ఆరు బయటనే లబ్ధిదారుల పాట్లు..
-బ్రిటిష్ అధికారులను మురిపించిన డిసిసిబి అధికారులు..
-డిసిసిబి అధికారుల దౌర్జన్యం.

తల్లాడ మండలం పరిధిలోని ముదునూరు గ్రామంలో రుణాలు సకాలంలో చెల్లించ లేదనే కారణంతో డిసిసిబి అధికారులు దౌర్జన్యం చేసి ఇళ్లకు తాళాలు వేసిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది, 2015 16 సంవత్సరం లో ఒక్కో సభ్యుడు పదివేలు చొప్పున జే ఎల్ జి గ్రూపుల పేరుతో రుణాలు తీసుకున్నారు. గత ఆరు సంవత్సరాలుగా రుణాల చెల్లించమని నోటీసులు ఇవ్వలేదు అడగను లేదు,
ఉన్నపళంగా పదివేల 22 వేల రూపాయలు చెల్లించాలని డిసిసిబి అధికారులు ఎస్సీ కాలనీలో పిల్లలపై దౌర్జన్యానికి దిగి సామాన్లు జప్తు చేసి, ఇళ్లకు తాళాలు వేశారు. షెడ్యూల్ లో ఇళ్ల ముందే పడిగాపులు కాయాల్సి వచ్చింది అని బాధితులు వాపోయారు, కరోనా నేపథ్యంలో గత రెండు సంవత్సరాలుగా సామాన్య మధ్యతరగతి ప్రజానీకం తీసుకున్న రుణాలు చెల్లించలేని స్థితిలోకి వెళ్ళమని, కుటుంబ పోషణ భారంగా మారిన నేపథ్యంలో సంబంధిత అధికారులు రుణాల చెల్లింపు పేరుతో బలవంతంగా తమ ఇళ్లకు తాళాలు వేసి, ఇంట్లో ఉండి వెళ్ళగొట్టడం సహేతుకం కాదని వారు వాపోయారు,బాధితుల కథనం, ఇస్నే పల్లి ఆదాం, ఇనపనురి రాజశేఖర్ఇస్తేపల్లి స్వరాజ్యం ఉన్నపళంగా ఇంట్లోనుండి వెళ్లగొట్టి ఇంటికి తాళాలు వేశారు,ఇంటి ముందు కూర్చుని ఉండగా అధికారులు వచ్చి మమ్మల్ని ఇంట్లోకి వెళ్లకుండా గడియ పెట్టి తాళం వేసి సీజ్ చేశారు, ఏమిటీ అన్యాయం అని అడిగితే కడితే డబ్బులు కట్టండి లేకపోతే బయటికి వెళ్ళాలి అంటూ దౌర్జన్యంగా వెళ్లగొట్టారు అన్నారు, 7000 చెల్లించాం మిగతావి చెల్లిస్తాం గడువు కోరినా ఇవ్వకుండా దౌర్జన్యానికి దిగి తాళాలు వేశారు అని వాపోయారు.

గరిడేపల్లిలో సీజ్ చేసిన ఇంటి వద్ద కౌలు రైతు భూత్యా రామా

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో అప్పు చెల్లించాలంటూ డీసీసీబీ ఉద్యోగులు తాళాలు వేయడంతో బాధితులు రాత్రంతా చలిలో నానా అవస్థలు పడ్డారు. ఆకలితో అలమటిస్తున్న పిల్లలకు చుట్టుపక్కల వారిని అడిగి అన్నం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.. కామేపల్లి పీఏసీఎస్ ఆధ్వర్యంలో  మండలవ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు 2017లో రూ.10 వేల చొప్పున రుణాలు పంపిణీ చేశారు. గరిడేపల్లి, బర్లగూడెం గ్రామాల్లో అయిదు గ్రూపులకు చెందిన 30 మంది సభ్యులు రుణబకాయిలు చెల్లించలేదు. రూ.10 వేల రుణానికి వడ్డీతో కలిసి రూ.20 వేలను డీసీసీబీ అధికారులు వసూలు చేస్తున్నారు. ఇళ్లు జప్తు చేస్తామని గురువారం హెచ్చరికలు చేయడంతో 26 మంది సొమ్ము చెల్లించారు. మరో నలుగురు చెల్లించలేకపోవడంతో డీసీసీబీ సిబ్బంది వారి ఇళ్లకు సీలు వేశారు. మరో అవకాశం ఇవ్వాలని అధికారులను బతిమాలినా కరుణించలేదు. నలుగురిలో ముగ్గురు కౌలు రైతులు. మరొకరు కూలీ. వీరు చేసేదేమీ లేక గురువారం రాత్రంతా ఇంటి బయటే ఉండిపోయారు. కొవిడ్ కారణంగా ఇరుగుపొరుగు వారెవరూ ఇళ్లలోకి రానివ్వలేదని బాధితులు భూక్యా రామా, ధరవత్ భావింగ్, శ్రీను, అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. వైరస్ కారణంగా మిరప తోటలు పూర్తిగా దెబ్బ తినడంతో డబ్బుల్లేక అప్పు చెల్లించలేకపోయామన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ముగ్గురు కౌలు రైతులు శుక్రవారం రుణబకాయిలను చెల్లించారు.

నేలకొండపల్లి మండలంలో సుర్దేపల్లి గ్రామంలో జెఎల్ జి గ్రూపు సభ్యులకు ఇచ్చిన లోన్ కట్టలేదని డి సి సి బి బ్యాంకు వారి ఇళ్లకు సీల్ వేశారు.ఈ నేపథ్యంలో డీసీసీబీ అధికారులతో నేలకొండపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. వెంటనే ఋణ గ్రహీతలు ఇళ్లకు తళలలు తొలగించారు.త్వరలోనే రుణం చెల్లించేందుకు లబ్దిదారులు సుముఖత వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గ సేవాదళం కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు , ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రిపోతుల అంజని, నేలకొండపల్లి మండలం కాంగ్రెస్ నాయకులు గరిడేపల్లి రామారావు , దారమల్లె వెంకటేశ్వర్లు, బచ్చలకూరి అప్పారావు, కత్తుల మల్లయ్య నేలకొండపల్లి మండల యువజన కాంగ్రెస్ నాయకులు ఎడవెల్లి నాగరాజు, అనంత నాగేంద్రబాబు, గట్టికొండల విజయ్ , దేవపోంగు నరేందర్, తదితరులు పాల్గొన్నారు

Related posts

తెలంగాణలో సమ్మె విరమించిన జూనియర్ డాక్టర్లు…

Drukpadam

ముంబైలో కూలిన 4 అంతస్తుల భవనం.. 11 మంది సజీవ సమాధి…

Drukpadam

నకిలీ సంఘానికి శిక్ష తప్పదు … ఐజేయూ, టీయుడబ్ల్యుజె హెచ్చరిక!

Drukpadam

Leave a Comment