గ్రానైట్ పరిశ్రమల సమస్యలపై మంత్రి పువ్వాడ,
ఎంపీ నామ సమీక్ష
గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ద్రుష్టి సారించింది. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం , కరీంనగర్ , వరంగల్ , హైద్రాబాద్ జిల్లాలో ఉన్న గ్రానైట్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని సీఎం సూచనల మేరకు ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ , ఖమ్మమే ఎంపీ నామా నాగేశ్వరరావు , రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు . ప్రధానంగా గ్రానైట్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన జిల్లాల నుంచి వచ్చిన గ్రానైట్ యజమానులు వివరించారు. వారి సమస్యలను సావధానంగా విన్న మంత్రి , సీఎస్ లు ఈ విషయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకోని పోయి పరిష్కరిస్తామని అన్నారు .
గ్రానైట్ పరిశ్రమల సంబంధిత సమస్యలు పై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ గ్రానైట్ సంఘాల ప్రతినిధులతో సమీక్షించారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ జిల్లాల గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులతో సమావేశమై పలు సమస్యలపై చర్చించారు
గ్రానైట్ చిన్న స్థాయి పరిశ్రమలకు గతంలో మాదిరిగా రాయల్టీ మీద ఉన్న 40 శాతం రాయితీ, అదే విధంగా టన్నేజీ విధానంతో నష్టం వస్తున్న నేపథ్యంలో ఆ విధానాన్ని అమలును నిలిపివేయాలని గ్రానైట్ సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.
సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారంకు కృషి చేస్తామని, గ్రానైట్ చిన్నతరహా పరిశమ్రలకు భరోసా కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. స్లాబ్ సిస్టమ్ కొరకు ప్రయత్నం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ రొనాల్డ్ రోస్, తెరాస రాష్ట్ర నాయకులు వద్దిరాజు రవిచంద్ర, గ్రానైట్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు