Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వేటు వేస్తారా ? రాజీనామా చేస్తారా ? ఎంపీ రఘురామ వ్యవహారం చివర అంకానికి!

వేటు వేస్తారా ? రాజీనామా చేస్తారా ? ఎంపీ రఘురామ వ్యవహారం చివర అంకానికి!
ఎంపీ రఘురామ అనర్హతపై ప్రివిలేజ్ కమిటీ విచారణకు స్పీకర్ ఆదేశం
నివేదిక ఇవ్వండి.. స్పీకర్
అనర్హత వేటు వేయాలని వైసీపీ ఎంపీ ఫిర్యాదు
విచారణ జరపాలని ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ ఆదేశం
తృణమూల్ ఎంపీపైనా ఫిర్యాదు చేసిన ఆ పార్టీ నేత

వైసీపీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచి పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న రఘురామ మాజీ కావడం దాదాపు ఖాయమైందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఏవిధంగా మాజీ అవుతారు అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది . అయితే వేటు కన్నా ముందుగానే ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఇదే నిజమైతే ఫిబ్రవరి మొదటి వారంలో ఆయన రాజీనామా చేస్తారని అంటున్నారు .ఆయన కూడా ఆ ఫీలర్లు వదిలారు . ఉప ఎన్నికలకు సిద్ధపడ్డారు . తిరిగి నరసాపురం ఉపఎన్నికల్లో పోటీ చేయబోతున్నారని ఆయన అనుయాయులు పేర్కొంటున్నారు. అయితే ఏపార్టీ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు అనేది ఆశక్తిగా మారింది. బీజేపీ చేరేందుకు ఆయన పెద్ద ఎత్తున పావులు కదిపారు. అయితే ఇప్పుడున్న పరిస్థిల్లో బీజేపీ లో చేర్చుకుంటే తప్పడు సంకేతం పోతుందనే భావన ఉండటంతో ఆయన పవన్ కళ్యాణ్ జనసేన వైపు మొగ్గు చూపుతున్నారని ప్రచారం జరుగుతుంది. టీడీపీ లో చేరితే ఇబ్బందులు ఉంటాయని భావించిన రఘురామ జనసేన అయితే బీజేపీ ,జనసేన మధ్య పొత్తులు ఉన్నందున బీజేపీ ప్రచారం చేస్తుందని అదే విధంగా టీడీపీ ని కూడా మద్దతు ఇచ్చేలా ఒప్పించాలని చూస్తున్నారు .

వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అనర్హత పిటిషన్ పై నివేదిక ఇవ్వాల్సిందిగా లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా ఆదేశించారు. పార్టీ తరఫున గెలిచి ఆ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నందున ఆయన్ను అనర్హుడిగా ప్రకటించాలంటూ వైసీపీ లోక్ సభ విప్ మార్గాని భరత్ .. స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ చర్యలకు ఆదేశించారు.

ఆ పిటిషన్ ను ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. ప్రాథమిక విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా స్పీకర్ ఆదేశాలిచ్చినట్టు లోక్ సభ సచివాలయం వెల్లడించింది. కాగా, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ శిశిర్ అధికారిపై ఆ పార్టీ లోక్ సభాపక్షనేత సుదీప్ బంధోపాధ్యాయ కూడా అనర్హత విషయంలో ఫిర్యాదు చేశారు. ఆ పిటిషన్ నూ స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి సిఫార్సు చేశారు.

Related posts

హుజూరాబాద్‌కు రూ. 1000 కోట్లు ఎవరికి గుణపాఠం చెప్పేందుకు?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్

Drukpadam

కాబూల్ లో కర్ఫ్యూ విధించిన తాలిబన్లు.. రోడ్లన్నీ నిర్మానుష్యం!

Drukpadam

మళ్లీ టీడీపీలో చేరుతున్నారనే వార్తలపై శిల్పా చక్రపాణిరెడ్డి క్లారిటీ!

Drukpadam

Leave a Comment