Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కేంద్రం తీరుపై టీఆర్ యస్ రాజ్యసభ ,లోకసభ పక్ష నాయకులు కేకే ,నామా ధ్వజం!

కేంద్రం తీరుపై టీఆర్ యస్ రాజ్యసభ ,లోకసభ పక్ష నాయకులు కేకే ,నామా ధ్వజం!
-ఫెడరల్ స్ఫూర్తిని కేంద్రం దెబ్బతీసిందని మండిపాటు
-ప్రజాసమస్యలు చెప్పుకునే వేదికపై సమస్యలు చెప్పకుండా నోరు నొక్కుతున్నారని విమర్శ
-విభజన చట్టంలోని అంశాలను పట్టించుకోక పోవడంపై ఫైర్
-తెలంగాణ ను శత్రువుగా చూస్తున్నారంటూ కేంద్రాన్ని నిలదీశారు
-అఖిల‌ప‌క్ష స‌మావేశంలో కేంద్రం తీరుపై మండిప‌డ్డ కే.కే, నామ
-తెలంగాణ‌కు సంబంధించిన కీల‌కమైన అంశాల‌ను సమావేశంలో దృష్టికి తీసుకు వచ్చిన .. నామ.. కే.కే

కేంద్రప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని టీఆర్ యస్ రాజ్యసభ ,లోకసభ పక్ష నేతలు కె కేశవరావు , నామా నాగేశ్వరరావులు మండిపడ్డారు . సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన వారు రాష్ట్రం పట్ల కేంద్ర వైఖరికి నిరసనగా రాష్ట్రపతి ప్రసంగాన్ని టీఆర్ యస్ ఎంపీ లు బహిష్కరించారు. అనంతరం వారు వివిధ పక్షాల నేతలతో వర్చువల్ గా మాట్లాడాను కేంద్ర ప్రభుత్వ విడనాణాలను తూర్పారబట్టారు . రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న అన్యాయాలను ఎత్తు చూపి ఎద్దగట్టారు . కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిని పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్..

దేశంలో అన్ని రాష్ట్రాలకు మెడికల్ కాలేజీలు మంజూరు చేశారనీ… తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఎందుకు ఇవ్వలేదని సూటిగా ప్రశ్నించిన నేతలు ..తమ ప్రతిపాదనలు బుట్టదాఖలు చేస్తూ అవమానించడంపై వారు ఫైర్ అయ్యారు. ఐ ఐ ఎం లు ఐ బి ఎం లు మంజరికి నోచుకోకపోవడం దారుణమని అన్నారు .

దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని…. ఉపాధి కల్పనకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదని విమర్శించారు …తాము అధికారంలోకి వస్తే ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు .

వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన రూ.450 కోట్ల బకాయిలు ఎన్నిసార్లు విజ్ఞ‌ప్తి చేసినా ఇవ్వ‌డం లేదని గుర్తు చేసిన నేతలు..పార్లమెంటులో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయి వారు తెలిపారు .

Related posts

ఈయన పెద్ద దానకర్ణుడిలా మాట్లాడుతున్నాడు: సీఎం జగన్ పై చంద్రబాబు ఫైర్

Ram Narayana

వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మరోసారి అరెస్ట్!

Drukpadam

హైద్రాబాద్ ఫిలిం నగర్ లో ఎన్టీఆర్ కు మంత్రి అజయ్ నివాళులు …

Drukpadam

Leave a Comment