Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అమరావతి భూముల అవకతవకలపై చంద్రబాబు అరెస్ట్ తప్పదా ?

అమరావతి భూముల అవకతవకలపై చంద్రబాబు అరెస్ట్ తప్పదా ?
-వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న సి ఐ డి
-ఇప్పటికే సెక్షన్ 41 బి ప్రకారం నోటీసులు అందజేత
-ప్రాధమిక విచారణలో అవకతవకలు జరిగినట్లు సి ఐ డి నిర్దారణ
– న్యాయనిపుణులతో చంద్రబాబు సంప్రదింపులు
అమరావతి భూముల అవకతవకలపై చంద్రబాబు అరెస్ట్ తప్పదా ? అంటే అవుననే అంటున్నారు.న్యాయనిపుణులు . ఇప్పటికే విచారణ జరిపిన సి ఐ డి అధికారులు ప్రాధమికంగా అవకతవకలపై ఒక నిర్దారణకు వచ్చారు. ఆప్రాంత రైతులు కొందరు తమ భూములను బలవంతంగా తీసుకున్నారని మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణ రెడ్డికి చేసిన ఫిర్యాదు పేరుకు దీనిపై విచారణ జరిపిన ఏపీ సి ఐ డి అధికారులు అనేక అవకతవకలను కనుగొన్నారు.దీనిపై సి ఐ డి అధికారుల ముందు హాజరు కావాలని మాజీ సీఎం సి ఆర్ డి ఏ చైర్మన్ గా వ్యవహరించిన ఇందుకు ప్రధాన భాద్యుడని అందువల్ల అప్పటిలో జరిగిన విషయాలపై విచారణ కమిటీ ముందు ఈ నెల 23 వ తేదీన ఉదయం 11 గంటలకు హాజరు కావాలని చంద్రబాబు కు సెక్షన్ 41 బి ప్రకారం ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. ఒక వేళ ఆయన ఉద్దేశపూర్వకంగా విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ చేసే ఆవకాశం ఉంది . చంద్రబాబుకు రెండే రెండు మార్గాలు ఉన్నాయని అందులో ఒకటి క్యాష్ పిటిషన్ వేయటం .రెండు బెయిల్ తెచ్చుకోవడం అని న్యాయ నిపుణులు అంటున్నారు. నోటీసు అందుకున్న చంద్రబాబు ఈ విషయాలపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సెక్షన్ లు ఐ పి సి 166 ,167 ,217 ప్రకారం నేరుగా విచారణ అధికారులే చర్యలు తీసుకునే అవకాశానాలు ఉన్నాయి . అందువల్ల సి ఐ డి అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.ఫక్కగా న్యాయనిపుణుల సలహాలు తీసుకుని దాని ప్రకారం ఈ కేసులో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తుంది. సి ఐ డి అదనపు డి జి సుశీల్ కుమార్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన అధికారులు సెషన్ 120 బి రెడ్ విత్ 33 ,34 ,35 ,36 ,37 ల ప్రకారం ఈ అవకతవకల్లో నలుగురు కు మించి ఎక్కువమంది ఈ కుట్రకు పాల్పడే అవకాశం ఉండనే అభిప్రాయాలూ ఉన్నాయి. దీనితో ఈ కేసు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది . అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించే ముందు ,తమకు అనుకూలమైన వారికీ, దగ్గరివారికి , బందువులకు , సమాచారాన్ని లీక్ చేసి వారు ఆప్రాంతాలలో భూములు కొనేలా చేశారని అభియోగాలు ఉన్నాయి. అందువల్లనే రాజధాని ప్రాంతానికి సంబంధం లేని అనేక మంది వందల కిలోమీటర్ల నుంచి వచ్చి ఎక్కడో ఉన్న మారుమూల పల్లెలో ఎలా భూములు కొంటారని ప్రభుత్వం అంటుంది. రైతులను బెదిరించి , భయపెట్టి , తక్కువరేట్లకు కొనుగోలు చేసి ఎక్కువ రేట్లకు అమ్ముకున్నారని ఫిర్యాదులు ఉన్నాయి . ఎస్సీ, ఎస్టీ లకు చెందిన భూములు ,ప్రభుత్వ భూములు చౌవక ధరలకు కొంతమంది కొనుగోలు చేశారని ఫిర్యాదులు ఉన్నాయి.

 

Related posts

ప్రేమపెళ్లిళ్లు …విడాకులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు …

Drukpadam

తనను గుడ్డిగా నమ్మిన ఫాలోవర్లకు రూ.437 కోట్లకు టోకరా వేసిన యూట్యూబ్ స్టార్ !

Drukpadam

సీడ్స్ ను వేయించకుండా తింటున్నారా..?

Drukpadam

Leave a Comment