నేను నిప్పును ఎవరికీ భయపడను … చంద్రబాబు…
నోటీసులు అందుకున్న చంద్రబాబు జగన్ పై ఫైర్
-నీ దిక్కు ఉన్న చోటు చెప్పుకో మని హెచ్చరిక
-చట్ట పరంగా ఏదియైతే అది చేసుకోమని సవాల్
-తప్పు చేయలేదు … మీ బెదిరింపులకు భయపడం
-నీ వెందుకు శుక్రవారం …శుక్రవారం సిబిఐ విచారణకు ఎందుకు హాజరు కావటం లేదు
పిచ్చి పరాకాష్టకు చేరితే ఇదే విధంగా ఉంటుందని ఆగ్రహం
నేను నిప్పును ఎవరికీ భయపడను ఎక్కడ తప్పు చేయలేదు అని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు అనే మాటలు .కానీ అమరావతి అసైన్డ్ భూముల కొనుగోనాలు వ్యవహారంలో జరిగిన అక్రమాలపై ఏపీ సి ఐ డి అధికారులు రంగంలో దిగటంతో ఒక్క సరిగా చంద్రబాబు పై కేసు లపై రాజకీయవర్గాల్లో ఆశక్తి నెలకొన్నది . ఏమి జరగ బోతుంది అని చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారనే ఉత్కంఠ నెలకొన్నది . హైదరాబాద్ లో చంద్రబాబు నివాసానికి చేరుకొన్న ఏపీ సి ఐ డి అధికారుల ప్రత్యేక బృందం ఆయనకు నోటీసులు అందచేసిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు . తనకు నోటీసులు అందజేయటం పై అసహనంగా ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్ పై నిప్పులు చెరిగారు.చట్టపరంగా ఏమైతే అది చేసుకోండి మేము మీ దయాదక్షిణ్యాలపై ఆధారపడి లేము అది గుర్తుంచుకోండి . 7 నెలలుగా ఎదో చేస్తామని అంటున్నారు. మేము ఎలాంటి తప్పు చేయలేదు.29 వేల మంది రైతులు 34 వేల ఎకరాల భూములు ఇచ్చారు. ఇందులో ఒక్క తెలుగుదేశం వాళ్లే ఉన్నారా ? వైసీపీ లేదా ? అందరు ఉన్నారు. అయినా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచింది ఎవరు ? పిచ్చి పరాకాష్టకు చేరితే ఇదే మాదిరిగా ఉంటుంది.మీ ఇంట్రస్టులు కాపాడుకోవడానికి పేదవాళ్ల పొట్ట కొట్టవద్దని అన్నారు.ఈ ప్రాంత ప్రజల మనోభావాలు కాపాడాల్సిన అవసరం ఉంది.డబ్బులు ఉన్నాయి ,టీవీ లు ఉన్నాయని మీ ఇష్టం వచ్చి నట్లు చేస్తే కొంతకాలం నడుస్తాయేమో కానీ ఎల్లకాలం నడవవు గుర్తు పెట్టుకోవాలి అని హెచ్చరించారు.
previous post