పట్టభద్రుల ఎన్నికల్లో తీన్మార్ గట్టి పోటీ…
మూడవస్థానంలో కోదండరాం , నాలుగు,ఐదు స్థానాలలో బీజేపీ ,కాంగ్రెస్
నల్లగొండ ,ఖమ్మం ,వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో తీన్మార్ గట్టి పోటీ ఇస్తున్నారు.ఎవరు ఊహించని విధంగా ఆయన అధికార పార్టీకి చెందిన పల్లా రాజేశ్వేర రెడ్డి కి గట్టి పోటీ ఇస్తుండటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.ప్రొఫసర్ కోదండరాం కన్నా ముందున్నారు. మొదటి రౌండ్ లో పల్లా రాజేశ్వరరెడ్డి కి 16130 ఓట్లు రాగ ,తీన్మార్ మల్లన్నకు 12046 ఓట్లు వచ్చాయి. కోదండరాం కు 9080 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్ లో పల్లా 4084 ఓట్లు మైజార్టీ లభించింది. మరో ఆరోరౌండ్లు లెక్కించాల్సిఉంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఎవరు గెలిచే ఆవకాశం లేదనే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి. దీంతో టీఆర్ యస్ వర్గాలలో ఆందోళనలో ఉన్నాయి .టీఆర్ యస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపు నల్లేరుమీద నడకేనని వార్ వన్ సైడ్ అనుకున్న అధికార పార్టీ నేతలు ఆలోచనలో పడ్డారు. మూడు ఉమ్మడి జిల్లాల్లో మంత్రిలు ఎంపీ లు ఎమ్మెల్యేలు జడ్పీ చైర్మన్ లు, డీసీసీబీ చైర్మన్లు ,ఎమ్మెల్సీలు ఇలా ఒకరేమిటి పార్టీలోని అందరు కలిసికట్టుగా పని చేశారు.డబ్బులు దండిగా పంచారనే అభియోగాలు ఉన్నాయి. అధికార యంత్రాంగం పోలీస్ అంతా అనుకూలంగా ఉన్నప్పటికీ తక్కువ ఓట్లు రావటంపై కేసీఆర్ ,కేటీఆర్ లు సైతం ఆరా తీసుతున్నట్లు తెలుస్తుంది.