Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఖమ్మంలోనేటి నుండి విశ్వమాత శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరీ దేవీ మహోత్సవాలు: మేళ్లచెర్వు

ఖమ్మంలో నేటి నుండి విశ్వమాత శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరీ దేవీ మహోత్సవాలు: మేళ్లచెర్వు

గాలిగోపురము, కలశ ప్రతిష్ట, గీతా మందిరము, రామ మందిరము ప్రారంభోత్సవాలకు ఏర్పాట్లు రెడీ..

హాజరుకానున్న భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి, బ్రహ్మశ్రీ ఎల్ వి గంగాధర శాస్త్రి, పద్మశ్రీ గరిక పాటి నరిసింహారావు, డా. గెల్లా విశ్వనాథ్

 

ఖమ్మం నగరంలోని గుట్టల బజారులో కొలువుదీరి, భక్తుల కొంగుబంగారంలా విలసిల్లుతున్న విశ్వమాత శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయ మహోత్సవాలు నేటినుండి మూడు రోజుల పాటు కన్నుల పండువగా జరిపించుకునేందుకు గాను ఏర్పాట్లు పూర్తిచేసినట్టు దేవాలయ పాలకమండలి చైర్మన్ మేళ్ల చెర్వు వెంకటేశ్వరరావు అన్నారు. శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరీ దేవాలయ ప్రాంగణంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆలయ చైర్మన్ మేళ్లచెర్వు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నేటి నుండి జరుగనున్న అమ్మవారి వేడుకల సందర్భంగా జరిగే పవిత్ర క్రతువులను భక్తులు విజయవంతం చేసి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. వేడుకలలో భాగంగా ప్రారంభపు రోజైన 5వ తేదీన హెూమములు, పురాణ ప్రవచనము, వాస్తు హెూమములు తదితర క్రతువులను వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఆరో తేదీన వేద పారాయణము, హెూమములు, సూర్యనమస్కారాలు, మహాలింగార్చన, ఏకదశ రుద్రాభిషేకము, క్షీరాబ్ది వాసము, తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. చివరి రోజైన ఏడో తేదీన ఉదయం 9,05గంటలకు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతీ స్వామి (భువనేశ్వరి పీఠాధిపతులు, గన్నవరం) వారి చేతుల మీదుగా గాలి గోపురము, కలశ ప్రతిష్టా మహోత్సవము జరుగుతుందన్నారు. ఉదయం 11.26నిమిషాలకు బ్రహ్మశ్రీ ఎల్వీ గంగాధర శాస్త్రి (భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు) గారిచే రామ మందిరము, గీతా మందిరము, శ్రీ కృష్ణ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం ఉంటుందని తెలిపారు. మధ్యాహ్నం 12గంటలకు అతిధుల ఆధ్యాత్మిక ప్రసంగం అనంతరం అన్న ప్రసాద వితరణ జరుగుతుందన్నారు. సాయంత్రం ఆరు గంటలకు పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి పుణ్యదంపతులకు ఆలయ పాలక మండలి తరపున ఆత్మీయ సత్కారం జరుగుతుందన్నారు. అనంతరం ప్రముఖ అంతర్జాతీయ శ్వాసకోశ వైద్య నిపుణులు, ఖమ్మం నగరానికి చెందిన డా. గెల్లా విశ్వనాథ్ గారికి సన్మాన కార్యక్రమం ఘనంగా జరుపనున్నట్టు తెలిపారు. సాయంత్రం 6.30గంటలకు మహాసహస్ర అవధాని, సాగరఘోష కవి, ప్రవచన కిరీటి గరికపాటి నరసింహారావు గారిచే ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుందని మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు మీడియాకు వెల్లడించారు. దేవాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీ వాసవీ మాత విశ్వమాతగా ఎలా అవతరించారు, లోక కల్యాణం కోసం ఆమె ప్రాణ త్యాగం చేసిన సందర్భాన్ని మేళ్లచెర్వు సవివరంగా వివరించారు. అహింసా పరమో ధర్మ: అనే సిద్ధాంతాన్ని ఆచరించి శ్రీ వాసవీ మాత ప్రపంచ మానవాళికి గొప్ప సందేశం అందించారని అన్నారు. ధర్మరాజు, సత్య హరిశ్చంద్రుడు, మహాత్మా గాంధీ తదితరులు ఆచరించి మహాత్ములుగా నిలిచేందుకు ఆచరించిన అహింస అనే ఆయుధము శ్రీ వాసవీ మాత ఆచరించి చూపారని గుర్తుచేశారు. ఆనాడు అమ్మవారు అహింసను పాటించి విశ్వమాతగా అవతరించగా, తెల్లదొరలను తరిమేసేందుకు గాను గాంధీ కూడా అహింస అనే మార్గాన్నే ఆచరించి నేడు జాతిపితగా అవతరించారని మేళ్లచెర్వు గుర్తుచేశారు. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరీ దేవ్యాలయ ప్రధాన కార్యదర్శి దేవత అనిల్ కుమార్, భద్రాద్రి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్, దేవ్యాలయ కమిటీ గౌరవ సలహా దారులు చెరుకూరి కృష్ణమూర్తి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు చిన్ని కృష్ణారావు మాట్లాడుతూ గడిచిన దశాబ్దకాలంలో శ్రీ వాసవీ మాత ఆలయం అనేక అంశాల్లో అద్భుతమైన విధంగా అభివృద్ధి చెందిందన్నారు. అన్ని రకాల సౌకర్యాలను భక్తులకు కల్పించేందుకు గాను పాలక మండలి అహర్నిశలు కృషిచేశారని వారు అన్నారు. నేటి నుండి జరిగే అమ్మవారి మహోత్సవాలకు సంబంధించిన పవిత్ర కార్యాలలో పాల్గొని విజయవంతం చేసి, అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం
లో దేవాలయ పాలకమండలి కోశాధికారి కొత్తమాసు హేమసుందర్రావు, ఉపాధ్యక్షులు బిజ్జాల ఈశ్వరరావు, గెల్లా అమర్నాథ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీలు చెరుకూరి నంతోష్ కుమార్, డా. దేవరశెట్టి పూర్ణచందర్రావు(డీపీసీరావు), కుమ్మరి కుంట్ల శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శులు దుగ్గి శ్రీనివాస రావు, చెరుకూరి వెంకట శ్రీనివాసరావు, అనుమోలు రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

తాడేపల్లిలో సంక్రాంతి వేడుకలు…. హాజరైన సీఎం జగన్ దంపతులు

Ram Narayana

5 లక్షల విమాన టికెట్లను ఉచితంగా అందిస్తున్న హాంకాంగ్!

Drukpadam

రేపే పదవీ విరమణ… పోస్టింగ్ ఇవ్వాలంటూ నేడు సీఎస్ ను కలిసిన ఏబీ వెంకటేశ్వరరావు…

Ram Narayana

Leave a Comment