Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

గుడివాడలో క్యాసినో వ్య‌వ‌హారంపై ఢిల్లీలో ఈడీకి ఫిర్యాదు చేసిన రామ్మోహ‌న్ నాయుడు!

గుడివాడలో క్యాసినో వ్య‌వ‌హారంపై ఢిల్లీలో ఈడీకి ఫిర్యాదు చేసిన రామ్మోహ‌న్ నాయుడు!
-క్యాసినోపై విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరాం
-గోవా నుంచి యువ‌తుల‌ను ఏపీకి తీసుకొచ్చారు
-క్యాసినో, విమాన టికెట్లకు సంబంధించిన‌ ప‌లు ఆధారాలు ఇచ్చాం
-500 కోట్ల రూపాయ‌లు చేతులు మారాయ‌న్న టీడీపీ నేత‌లు

గుడివాడలో కాసినో నిర్వహించారని టీడీపీ పెద్ద ఎత్తున ఏపీలో ఆందోళనలు చేసింది. ప్రత్యేకించి గుడివాడలోని రాష్ట్ర మంత్రి కొడాలి నాని కల్యాణ మంటపంలో కాసినో పేరుతొ పెద్ద ఎత్తున గోవా నుంచి అమ్మాయిలను తెప్పించి కాసినో నిర్వహించారని తమ వాటి అధరాలు ఉన్నాయని టీడీపీ అంటుంది. టీడీపీ ,వైసీపీ నేతల మధ్య పరస్పర విమర్శలు చేసుకున్నారు. మంత్రి స్వయంగా దీన్ని నిర్వహించారని టీడీపీ నేతల ఆరోపణ .దాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. అయినప్పటికీ టీడీపీ వదలలేదు . దీనిపై ఢిల్లీలో ఈడీకి సైతం ఫిర్యాదు చేసింది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి స‌మ‌యంలో క్యాసినో నిర్వ‌హించ‌డంపై టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు మండిప‌డ్డారు. ఈ రోజు ఢిల్లీలో ఆయ‌న త‌మ పార్టీ నేత ఆల‌పాటి రాజాతో క‌లిసి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ)కి క్యాసినో వ్య‌వ‌హారంపై ఫిర్యాదు చేశారు.

ఈడీ అధికారులను కలిసిన అనంత‌రం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ… క్యాసినోపై విచార‌ణ జ‌ర‌పాల‌ని కోరిన‌ట్లు చెప్పారు. గోవా నుంచి యువ‌తుల‌ను ఏపీకి తీసుకొచ్చార‌ని చెప్పారు. ఈడీ విచార‌ణ జ‌రిపితే పూర్తి వివ‌రాలు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని తెలిపారు. క్యాసినో, విమాన టికెట్లకు సంబంధించిన‌ ప‌లు ఆధారాల‌ను ఈడీకి స‌మ‌ర్పించామ‌ని చెప్పారు. పేకాట, డ్ర‌గ్స్, జూదం వంటి కార్య‌క‌ల‌పాల‌తో 500 కోట్ల రూపాయ‌లు చేతులు మారాయ‌ని ఆల‌పాటి రాజా ఆరోపించారు.

Related posts

పార్టీ కార్యాలయాల్లో కొత్త కార్పొరేటర్ల కోలాహలం… అభినందనల వెల్లువ

Drukpadam

మరో వివాదంలో జగన్ సర్కార్ ….

Drukpadam

నల్లారి, సినీ నటుడు మోహన్ బాబు బీజేపీ వైపు చూస్తున్నారా …?

Drukpadam

Leave a Comment