Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ …కరోనా తగ్గుముఖం:హెల్త్ డైరక్టర్!

క‌రోనా థ‌ర్డ్ వేవ్ పూర్తిగా ముగిసింద‌ని చెప్పుకోవ‌చ్చు.. ఐటీ సంస్థ‌లు వ‌ర్క్ ఫ్రం హోమ్ ఇవ్వ‌ద్దు: తెలంగాణ ప్రజారోగ్య శాఖ
స‌మ‌ర్థంగా అన్ని చ‌ర్య‌లు తీసుకున్నాం
రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గాయి
పూర్తిగా మాత్రం క‌నుమ‌రుగుల కాలేదు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ పూర్తిగా ముగిసింద‌ని చెప్పుకోవ‌చ్చని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాల‌కుడు గ‌డ‌ల శ్రీ‌నివాస‌రావు అన్నారు. ఈ రోజు ఆయ‌న హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ… థ‌ర్డ్ వేవ్ మొద‌లైన‌ప్ప‌టి నుంచి తాము స‌మ‌ర్థంగా అన్ని చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని ఆయ‌న అన్నారు. అందువల్ల పెద్దగా ఇబ్బందులు ఏమిలేవని అయితే జాగ్రత్తలు తప్పనిసరి అని హెచ్చరించారు.

రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గాయ‌ని వివ‌రించారు. అయితే, పూర్తిగా మాత్రం క‌నుమ‌రుగుల కాలేద‌ని చెప్పారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాక్సిన్లు వేయించుకోవాల‌ని ఆయ‌న చెప్పారు. టీకాలు తీసుకున్న వారిలో క‌రోనా ప్ర‌భావం త‌క్కువ‌గా ఉంటుంద‌ని తెలిపారు. క‌రోనా కొత్త వేరియంట్లు పుట్ట‌కుండా వ్యాక్సిన్ల వ‌ల్ల క‌ట్ట‌డి చేయొచ్చ‌ని చెప్పారు.

తెలంగాణ‌లో ఫీవ‌ర్ స‌ర్వే ద్వారా ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు ఇంటింటికీ వెళ్లి కిట్లు అంద‌జేశార‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌స్తుతం క‌రోనా ఆంక్ష‌లు స‌డ‌లిస్తున్నామ‌ని చెప్పారు. ఐటీ సంస్థ‌లు వ‌ర్క్ ఫ్రం హోమ్ ల ఆలోచ‌న‌ను విర‌మించుకోవాల‌ని ఆయ‌న కోరారు.

ఇప్పటివరకు ఉన్న కరోనా ఆంక్షలు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మెల్లమెల్లగా అన్ని ప్రభుత్వ ప్రవేట్ కార్యాలయాలు తిరిగి యధావిధిగా పనిచేసేందుకు చర్యలు చెప్పట్టాలని ఆదేశాలు జారీచేశారు . దేశంలో కూడా కేసులు తగ్గటంపై ప్రజల్లో భయాందోళనలు తగ్గుముఖం పట్టాయి. పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. ఇప్పటివరకు ఉన్న నిబంధనలు సడలించనున్నారు . అయితే ముందు జాగ్రత్తలు మాత్రం తప్పని సరి చేశారు .

Related posts

హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసం వద్ద సెక్యూరిటీ ఆడిట్.. ఓ మార్గాన్ని సగం తెరిచే యోచన!

Drukpadam

గొడ్డు మాంసం తినాలని ప్రోత్సహిస్తున్న మేఘాలయ బీజేపీ మంత్రి!

Drukpadam

హిజాబ్ ను టచ్ చేస్తే చేతులు నరుకుతా: రుబీనా ఖానం!

Drukpadam

Leave a Comment