Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రీడా వార్తలు

అహ్మదాబాద్ వన్డేలో టీమిండియా ఘనవిజయం…సిరీస్ కైవసం

అహ్మదాబాద్ వన్డేలో టీమిండియా ఘనవిజయం…
సిరీస్ కైవసం
44 పరుగుల తేడాతో ఓడిన వెస్టిండీస్
లక్ష్యఛేదనలో 193 పరుగులకే ఆలౌట్
4 వికెట్లు తీసిన ప్రసిద్ధ్ కృష్ణ

వెస్టిండీస్ తో అహ్మదాబాద్ లో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 44 పరుగులతో ఘనవిజయం అందుకుంది. 238 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన వెస్టిండీస్ ను 193 పరుగులకే ఆలౌట్ చేసింది. ఈ విజయంలో ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ ప్రధాన భూమిక పోషించాడు. ప్రసిద్ధ్ 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. శార్దూల్ ఠాకూర్ 2, సిరాజ్ 1, చహల్ 1, సుందర్ 1, హుడా 1 వికెట్ తీశారు. వెస్టిండీస్ జట్టులో షామ్రా బ్రూక్స్ అత్యధికంగా 44 పరుగులు సాధించాడు.

లోయరార్డర్ లో అకీల్ హోసీన్ (34), ఓడియన్ స్మిత్ (24) రాణించినా అది కాసేపే అయింది. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు 46 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. ఈ విజయంతో టీమిండియా 3 వన్డేల సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. ఇక ఈ నెల 11న ఇరు జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది.

టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ ప్రయోగాలపై సునీల్ గవాస్కర్ అసంతృప్తి

Sunil Gavaskar opines on Team India experiments with batting order
వెస్టిండీస్ తో రెండో వన్డేలో రెగ్యులర్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అందుబాటులో ఉన్నప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఓపెనర్లుగా బరిలో దిగడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. మిడిలార్డర్ లో వచ్చిన రిషబ్ పంత్ ఈ మ్యాచ్ లో పెద్దగా రాణించింది లేదు. 18 పరుగులు చేసి అవుటయ్యాడు. కాగా, బ్యాటింగ్ ఆర్డర్ లో ప్రయోగాలపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

రోహిత్ శర్మతో కలిసి రిషబ్ పంత్ ఇన్నింగ్స్ ప్రారంభించడం అనేది చివరి ఆప్షన్ గానే ఉండాలని అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ గానీ, శిఖర్ ధావన్ గానీ ఓపెనర్ గా బరిలో దిగుంటే బాగుండేదని గవాస్కర్ పేర్కొన్నాడు. ధాటిగా ఆడే ఎడమ చేతివాటం ఆటగాడే ఓపెనర్ గా కావాలనుకుంటే ఇషాన్ కిషన్ ను ఆడించ వచ్చని అన్నాడు.

కొవిడ్ తో బాధపడుతున్న రుతురాజ్ గైక్వాడ్ కోలుకుంటే, ఓపెనింగ్ స్థానానికి అందుబాటులో ఉంటాడని, అతడిని ఆడించడం కూడా మంచి ఆప్షన్ అవుతుందని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ లో గత కొన్నిసీజన్లలో రుతురాజ్ ఫామ్ ను చూశామని, దురదృష్టవశాత్తు కరోనా వల్ల దూరంగా ఉన్నాడని వివరించాడు. కాగా, వెస్టిండీస్ తో తొలి వన్డేలో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఆరంభించడం తెలిసిందే. ఆ మ్యాచ్ లో రోహిత్ శర్మ 60, కిషన్ 28 పరుగులు చేశారు.

అయితే రెండో వన్డేకు కేఎల్ రాహుల్ అందుబాటులోకి రావడంతో కిషన్ ను పక్కనబెట్టి రాహుల్ కు చోటు కల్పించారు. కానీ రాహుల్ ను ఓపెనర్ గా కాకుండా, మిడిలార్డర్ లో బరిలో దింపడం విమర్శకులకు పని కల్పించింది. అయితే ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించడంతో టీమిండియా వ్యూహకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

Related posts

టెస్టు క్రికెట్ ను ఉత్సాహభరితంగా మార్చే సత్తా ఈ ఆటగాడికి ఉంది: సెహ్వాగ్!

Drukpadam

వారెవ్వా జడేజా… మూడ్రోజుల్లోనే శ్రీలంకను ఫినిష్ చేసిన టీమిండియా!

Drukpadam

ఈ టెస్టు కోహ్లీకి ప్రత్యేకంగా మిగిలిపోయేలా చేస్తాం: రోహిత్ శర్మ

Drukpadam

Leave a Comment