Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

5 వ రౌండ్ లోను అదే తీరు…తగ్గని మల్లన్న బలం

5 వ రౌండ్ లోను అదే సీన్ తగ్గని మల్లన్న బలం
-కొనసాగుతున్న పల్లా ఆధిక్యం సుమారు 20 వేలు
-మూడవ స్థానంలోనే ప్రొఫెసర్
నల్లగొండ ,ఖమ్మం ,వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిలకల్లో కౌంటింగ్ రౌండ్ రౌండ్ కి ఉత్కఠత ను రేపుతోంది. ఎవరు విజేత అనేది చెప్పటం కష్టంగా మారింది. ముగ్గురు మధ్య పోటీ ఆశక్తి కరంగా ఉన్న మొదటి అభ్యర్థి పల్లా కు తీన్మార్ మల్లన్న కు మధ్య 20 వేల ఓట్లు తేడా ఉండగా ,కోదండరాం కు మల్లన్న కు మధ్య 10 వేల ఓట్ల తేడా ఉంది . అందువల్ల తీన్మార్ మల్లన్న నే గట్టి ప్రత్యర్థిగా కొనసాగుతున్నారు. వరసగా ఐదు రౌండ్లలో ఇదే తీరు కొనసాగటం విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది . అయితే చివరిదాకా ఎవరు నిలబడతారు అనేది చెప్పలేని పరిస్థితి ఉంది.కోందండరాం కు పల్లా కు మధ్య గ్యాప్ 30 వేలు ఉంది. అందువల్ల పల్లా ఛాన్స్ ను కూడా కొట్టిపారేయలేము . రెండవ ప్రాధాన్యత ఓట్లు ఎవరికీ ఎక్కువస్తాయనే దానిపైనే ఫలితం ఆధారపడి ఉంది.
దూసుకు పోతున్న ముగ్గురు 5 వ రౌండ్ పూర్తి అయిన తరువాత పల్లా సుమారు 20 వేల ఆధిక్యంలో ఉన్నారు పల్లాకు 79111,తీన్మార్ మల్లన్నకు 60605,కోదండరామ్ కు 49091 ఓట్లు లభించాయి. మరో రెండు రౌండ్ల లెక్కింపు మాత్రమే మిగిలి ఉంది. ఆరెంటిలోను ఫలితం ఇదే విధంగా ఉంటె చివర ఉన్న వారిని ఎలిమినేటి చేసి రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. అందువల్ల విజేతను నిర్ణయించటానికి మరింత సమయం పెట్టె ఆవకాశం ఉంది.

విచిత్ర మేమిటంటే ఎవరు ఊహించని తీన్మార్ మల్లన్న ఐదు రౌండ్లుగా రెండవ స్థానంలో కొనసాగుతుండటం . ఎక్కడో మద్యలో ఉన్న ఆయన బ్యాలెట్ పేపర్ ను వెతుక్కొని ఓటు వేశారంటే ఎంత జాగ్రత్తగా ఎంచుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

 

Related posts

ఏపీ డీజీపీ సవాంగ్ బదిలీ.. కొత్త డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి నియామకం!

Drukpadam

భద్రాద్రిలో నిరాడంబరంగా శ్రీరామ నవమి వేడుకలు… మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Drukpadam

ఇమ్రాన్ ఖాన్ ఎత్తుగడ మామూలుగా లేదు.. జాతీయ అసెంబ్లీల రద్దుకు సిఫారసు!

Drukpadam

Leave a Comment