ఆంధ్రప్రదేశ్

పెరూలో ఘోర బస్సు ప్రమాదం… 20 మంది దుర్మరణం…

పెరూలో ఘోర బస్సు ప్రమాదం… 20 మంది దుర్మరణం…

  • టయబంబా నుంచి ట్రుజిల్లో వెళుతున్న బస్సు
  • మారుమూల ప్రాంతంలో రోడ్డు ప్రమాదం
  • 100 మీటర్ల వాలులోకి జారిపోయిన బస్సు
  • 30 మందికి గాయాలు

పెరూ దేశంలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడిపోయిన ఘటనలో 20 మంది మృత్యువాతపడ్డారు. 30 మంది క్షతగాత్రులయ్యారు. బస్సు టయబంబా ప్రాంతం నుంచి ట్రుజిల్లో వెళుతుండగా ఈ ఘటన జరిగింది. అదుపుతప్పిన బస్సు రోడ్డు పైనుంచి పక్కనే ఉన్న 100 మీటర్ల వాలులోకి జారిపోయింది. ప్రమాదం జరిగిన ప్రదేశం ఓ మారుమూల ప్రాంతంలో ఉంది. దాంతో, ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వరకు అధికారులకు సమాచారం అందలేదు.

ఈ ప్రాంతంలో రోడ్లు అధ్వానంగా ఉంటాయి. కేవలం 340 కిలోమీటర్లు ప్రయాణించడానికి 14 గంటల సమయం పడుతుంది. గతుకుల రోడ్లు, కొండ ప్రాంతాలు, అధికవేగం వంటి కారణాలతో పెరూలో తరచుగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తుంటాయి. గత నవంబరులో ఉత్తర పెరూ అటవీప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు.

Related posts

రష్యా గెలిచాకే యుద్ధం ఆగుతుంది..పుతిన్ సలహాదారు!

Drukpadam

పోలవరం పరిహారం కోసం కేంద్రంతో కుస్తీ …ప్రధాని దృష్టికి తీసుకోని పోయా :జగన్

Drukpadam

తెలంగాణ గ్రూప్-1 ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ చేసిన సుప్రీంకోర్టు!

Ram Narayana