Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రత్యేక హోదా అంశం …ఎజెండాలోనే లేదు …జివిఎల్

వైసీపీ ఎంపీలు ఏదో సాధించారని టీవీల్లో విని చాలా సంతోషించాను.. తీరా ఆరా తీస్తే..: జీవీఎల్ నరసింహారావు

  • ప్రత్యేక హోదా అంశం రెండు రాష్ట్రాల కమిటీ అజెండాలో ఉండేది కాదన్న జీవీఎల్
  • ప్రత్యేక హోదా ఇవ్వాలంటే తెలంగాణతో చర్చించాలా? అని ప్రశ్న
  • సాక్షి టీవీలో ప్రసారమైన కథనాన్ని షేర్ చేసిన వైనం

వైసీపీ ఎంపీలపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సెటైర్లు వేశారు. వైసీపీ ఎంపీలు ఏదో సాధించారంటూ టీవీల్లో విని చాలా సంతోషించానని… తీరా ఆరా తీస్తే, ప్రత్యేక హోదా అంశం కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని రెండు రాష్ట్రాల కమిటీ అజెండాలో ఉండేది కాదని తెలియవచ్చిందని అన్నారు.

అసలు మనకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటే తెలంగాణ రాష్ట్రంతో చర్చించాలా? అనేది ఆలోచిస్తే అర్థమవుతుందని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా కామెంట్ చేశారు. దీనికి తోడు ‘కేంద్ర హోంశాఖ అజెండాలో ప్రత్యేక హోదా అంశం’ అంటూ సాక్షి టీవీలో వచ్చిన కథనాన్ని షేర్ చేశారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించేందుకు కేంద్ర హోంశాఖ త్రిసభ్య కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించే జీవీఎల్ ట్వీట్ చేశారు.

Related posts

థియేటర్లు మూతపడుతుంటే ఏడుపు వస్తుంది : ఆర్ నారాయణ మూర్తి!

Drukpadam

ఈసారి 100 సీట్లు ఖాయం: సీఎం కేసీఆర్…

Drukpadam

తెలంగాణాలో అమిత్ షా ఆపరేషన్ …పొంగులేటి మొగ్గుతారా … ?

Drukpadam

Leave a Comment