Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తిరుపతి ఉప ఎన్నికపై సీఎం జగన్ సమీక్ష

తిరుపతి పార్లమెంటు స్థానం ఉప ఎన్నికపై సీఎం జగన్ సమీక్ష
ఏప్రిల్ 17న తిరుపతి బై పోల్స్
అభ్యర్థిని ప్రకటించిన వైసీపీ
గెలుపు వ్యూహంపై నేతలతో సీఎం చర్చ
భారీ మెజారిటీతో గెలిచేలా ప్లాన్ చేయాలన్న సీఎం
తిరుపతి పార్లమెంటు సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ మృతితో ఉప ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 17న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతి బరిలో విజయం సాధించడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై చర్చించారు. విభేదాలు పక్కనబెట్టి కలిసికట్టుగా పనిచేయాలని నేతలను ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుపతిలో తిరుగులేని విజయం సాధించాలని స్పష్టం చేశారు.

తిరుపతి ఉప ఎన్నికల బరిలో వైసీపీ తరఫున సీఎం జగన్ వ్యక్తిగత వైద్యుడు గురుమూర్తి పోటీచేస్తున్నారు. టీడీపీ ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మిని పోటీకి నిలపగా… బీజేపీ-జనసేన అభ్యర్థిపై స్పష్టత రాలేదు. కాంగ్రెస్ తరఫున మాజీ ఎంపీ చింతా మోహన్ బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది.
బీజేపీ జనసేన మిత్రపక్షాల అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుంచి ఐఏఎస్ అధికారులుగా పని చేసి రిటైర్ అయినా రత్నప్రభ ,లేదా దాసరి శ్రీనివాసులు బరిలో నిలిపే ఆవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. దాసరి శ్రీనివాసులు స్థానికుడు కాగా రత్నప్రభ ఒంగోలు కు చెందిన వారు .శ్రీనివాసులు బీజేపీ లో చేరి ఎప్పటి నుంచో నియోజవర్గంలో సేవాకార్యక్రమాలు చేస్తున్నారు.

Related posts

కాపులను జగన్ కు తాకట్టు పెట్టారు…ముద్రగడపై హరిరామజోగయ్య ఫైర్

Drukpadam

ముహూర్తం ఫిక్స్.. 13న బీజేపీలోకి ఈటల…

Drukpadam

ఇన్నాళ్లూ పవన్ ను ఎవరైనా తిరగొద్దన్నారా?: సజ్జల

Drukpadam

Leave a Comment