Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఆవు మాంసం తినేవారు నాపై కుట్ర చేస్తున్నారు: రాజాసింగ్

ఆవు మాంసం తినేవారు నాపై కుట్ర చేస్తున్నారు: రాజాసింగ్

  • యూపీలో యోగికి ఓటు వేయనివారి ఇళ్లపైకి బుల్డోజర్లను పంపిస్తామన్న రాజాసింగ్
  • రాజాసింగ్ కు నోటీసులు పంపిన ఎన్నికల సంఘం
  • గతంలో అఖిలేశ్ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలను వివరించే ప్రయత్నం చేశానన్న రాజాసింగ్

యూపీలో యోగి ఆదిత్యనాథ్ కు ఓటు వేయని వారి ఇళ్లపైకి జేసీబీలను, బుల్డోజర్లను పంపిస్తామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలకు సంబంధించి రాజాసింగ్ కు ఎన్నికల సంఘం నోటీసులు పంపించింది. మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలియజేయాలని నోటీసులో పేర్కొంది. 24 గంటల్లో సమాధానం చెప్పాలని డెడ్ లైన్ విధించింది.

ఈ నేపథ్యంలో రాజాసింగ్ స్పందిస్తూ… కేంద్ర ఎన్నికల సంఘం నుంచి తన ఆఫీసుకు నోటీసులు వచ్చినట్టు ఇప్పుడే తెలిసిందని అన్నారు. గతంలో అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం ఉన్న సమయంలో యూపీలో ఎన్నో అరాచకాలు జరిగాయని… ఆ అరాచకాలను వివరించే ప్రయత్నమే తాను చేశానని చెప్పారు. ఆవు మాంసం తినేవారు తనపై కుట్ర చేస్తున్నారని అన్నారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మరోసారి రావాలని హోమం నిర్వహించేందుకు ఉజ్జయిని వెళ్తున్నానని చెప్పారు. ఈసీ ఇచ్చిన నోటీసులకు తన లాయర్ ద్వారా వివరణ ఇస్తానని తెలిపారు.

Related posts

మునుగోడు ఎన్నికల్లో మూకుమ్మ‌డి నామినేష‌న్లు…

Drukpadam

గజ్వేల్‌కు ఎట్ల వస్తవో అంటివి కదా కేసీఆర్.. ఇప్పుడు కనిపించిందా బొమ్మ: సీతక్క!

Drukpadam

లోకసభ ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు …రెండు రాష్ట్రాలుగా కర్ణాటక …?

Drukpadam

Leave a Comment