Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జగన్ పై మరోసారి కామెంట్ చేసిన హరీశ్ రావు!

జగన్ పై మరోసారి కామెంట్ చేసిన హరీశ్ రావు!
కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలపై జగన్ ఎందుకు స్పందించడం లేదు?
శ్రీకాకుళం జిల్లాలో 40 వేల మీటర్లు పెట్టారు
తెలంగాణకు కేంద్ర ప్రాజెక్టులు ఇవ్వడం లేదన్న హరీశ్

ఏపీ సీఎం జగన్ పై తెలంగాణ సీనియర్ మంత్రి హరీష్ రావు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. గతంలో కూడా బీజేపీ విధానాలపై ఆయన స్పందించడంలేదని , ప్రాజక్టు ల విషయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎలాంటి అనుమతులు లేకుండా ప్రారంభించారని హరీష్ ఏపీ సీఎం జగన్ పై మండిపడ్డారు . ఈసారి మోటార్లకు మీటర్లు పెట్టడంపై స్పందించిన హరీష్ రావు శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా పెట్టిన మోటార్లకు మీటర్ల పై జగన్ స్పందించకపోవడం దారుణమని అన్నారు .అనేక విషయాల్లో బీజేపీ రాష్ట్రాల హక్కులను హరిస్తుంటే నోరుమూసుకోవడంలో ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలపై జగన్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. మెడ మీద కత్తి పెట్టినా వ్యవసాయ బావుల వద్ద మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెగేసి చెపుతున్నారని అన్నారు.

అసలు విద్యుత్ సంస్కరణలు చేస్తేనే రాయితీలు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం సరికాదని చెప్పారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో 40 వేల కరెంట్ మీటర్లు ఎందుకు పెట్టారో బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యూపీలో బీజేపీకి ఓటు వేయకపోతే ఓటర్లను బుల్డోజర్లతో తొక్కిస్తామని ఎమ్మెల్యే రాజాసింగ్ అంటుంటే… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్ర ప్రాజెక్టులు ఇస్తున్నారని, తెలంగాణకు మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు.

Related posts

కాంగ్రెస్ ను ఇరకాటంలో పెట్టిన రేవంత్ …రంగంలోకి కాంగ్రెస్ హైకమాండ్..!

Drukpadam

పీకే వ్యూహాలు ,కేసీఆర్ రాజకీయ చతురత ప్రత్యర్థులు తట్టుకోగలరా ?

Drukpadam

ఎవడ్రా రాయలసీమ ద్రోహి…?: కర్నూలులో చంద్రబాబు ఉగ్రరూపం!

Drukpadam

Leave a Comment