Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

వరుసగా రెండో రోజూ రేవంత్​ హౌస్​ అరెస్ట్​.. రేవంత్ ఇంటి వద్ద ఉద్రిక్తత!

వరుసగా రెండో రోజూ రేవంత్​ హౌస్​ అరెస్ట్​.. రేవంత్ ఇంటి వద్ద ఉద్రిక్తత!

  • ఇంటి దగ్గర భారీగా పోలీసుల మోహరింపు
  • కేసీఆర్ తన నీడనూ నమ్మట్లేదంటూ టీపీసీసీ చీఫ్ ఫైర్
  • సీఎం పుట్టిన రోజు జరుపుకోవడానికి రెండో రోజూ అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం
  • నిరుద్యోగుల ఆత్మహత్య చేసుకుంటుంటే వేడుకలు అవసరమా? అని నిలదీత

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇవాళ కేసీఆర్ జన్మదినం సందర్భంగా గాడిదల దగ్గర కేక్ కట్ చేస్తామంటూ రేవంత్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన్ను ఇవాళ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై కేసులు నమోదు చేయాలన్న డిమాండ్ తో డీజీపీ ఆఫీసు ముట్టడికి తలపెట్టిన నేపథ్యంలో నిన్న కూడా ఆయన్ను పోలీసులు గృహ నిర్బంధంలోనే ఉంచారు.

ఇవాళ కూడా హౌస్ అరెస్ట్ చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు.. రేవంత్ ఇంటి వద్ద పోలీసుల తీరుకు నిరసన చేపట్టాయి. ప్రభుత్వం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు. రేవంత్ ఇంటి వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు.

కాగా, పోలీసులు, ప్రభుత్వం తీరుపై రేవంత్ మండిపడ్డారు. కేసీఆర్ అసలు తన నీడను కూడా నమ్మడం లేదంటూ ఫైర్ అయ్యారు. సీఎం పుట్టిన రోజు శుభాకాంక్షలు చేసుకోవడానికి తమను రెండో రోజూ అరెస్ట్ చేశారంటూ ఆయన ట్వీట్ చేశారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు  చేసుకుంటున్న ఇలాంటి టైంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం అవసరమంటారా? అంటూ కేసీఆర్ ను నిలదీశారు. #TelanganaUnemployementDay #ByeByeKCR అనే హాష్ ట్యాగ్ లను ట్వీట్ కు ఆయన జోడించారు.

Related posts

మత పిచ్చి తప్ప… ప్రజా సంక్షేమ పనులు ఒక్కటైనా చేశారా?: బండి సంజయ్ పై కేటీఆర్ ఫైర్!

Drukpadam

బీఏసీ సమావేశానికి బీజేపీ ని ఆహ్వానించకపోవడంపై ఆ పార్టీ ఎమ్మెల్యేల ఆగ్రహం…

Drukpadam

బీజేపీ అధ్యక్షుడు నడ్డా పదవీకాలం పొడిగింపు!

Drukpadam

Leave a Comment