Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రవేశ రుసుముల పై విమర్శలు!

సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రవేశ రుసుముల పై విమర్శలు!
ఐదేళ్లలోపు చిన్నారులకు పూర్తిగా ఉచితం
-6-12 ఏళ్లలోపు వారికి రూ. 75 ప్రవేశ రుసుం
పెద్దలకు రూ. 150 టికెట్
ప్రస్తుతానికి నిలిచిపోయిన త్రీడీ మ్యాపింగ్ లేజర్ షో

హైదరాబాద్ శివారు ముచ్చింతల్‌ శ్రీరామనగరం జీవాశ్రమంలోని సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ప్రవేశ రుసుములను ప్రకటించారు. దీనిపై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి. చిన్నజీయర్ స్వామి అనేక వ్యవప్రయాసలకోర్చి సమతా మూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం నిజంగా తెలుగు ప్రజలకు గర్వకారణం . దీనికోసం ఆయనపడ్డ శ్రమ అంతవింత కాదనేది దానిగురించి వినేవారికి అనిపిస్తుంది. ఇక కళ్లారా చూడాల్సిందే అని అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు చిన్న జియ్యర్ స్వామిని మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే … కానీ ముచ్చింతల్ లోని సమతా మూర్తి విగ్రహాన్ని చూడాలంటే దానికి రుసుము పెట్టడంపై భక్తులు పెదవి విరుస్తున్నారు. ఒకవేళ పెట్టిన మెయింటెన్సెస్ కోసం కొంత పెట్టడంలో తప్పులేదు . కానీ 5 సంత్సరాల పైబడి 12 సంవత్సరాల లోపు పిల్లలకు 75 రూపాయలు , పెద్దలకు 150 రూపాయలు ప్రవేశ రుసుము నిర్ణయించడం విమర్శలకు దారితీస్తుంది. అక్కడకు వచ్చి చూడాలన్న పేద ,సామాన్య భక్తులకు కొంత భారంగానే ఉంటుంది. అక్కడకు వచ్చేందుకు ప్రత్యేక వాహనాల ద్వారా మాత్రమే రావాల్సి ఉంటుంది. ఒక కుటుంబంలోని ఐదుగురు సభ్యులు అనుకున్నా, అందులో ఇద్దరు చిన్న పిల్లలు ఇద్దరు పెద్దవాళ్లకు వెరసి మొత్తం 450 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది పేదలకు భారమే కదా ? అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. దీన్ని చిన జియ్యర్ స్వామి ఆలోచించాల్సి ఉంది.

ఈ కేంద్రంలో కొన్ని అభివృద్ధి పనులు ఇంకా కొనసాగుతుండడంతో ఈ నెల 19 వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి మాత్రమే భక్తులను అనుమతిస్తారు. ఆ తర్వాతి రోజు నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లోనూ భక్తులను అనుమతిస్తారు. ప్రస్తుతానికి శ్రీరామనుజాచార్యుల సువర్ణమూర్తి విగ్రహ దర్శనం, త్రీడీ మ్యాపింగ్ లేజర్ షో, ఫౌంటేన్‌లను తాత్కాలికంగా నిలిపివేశారు.

బంగారు విగ్రహం చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ఫ్రేం ఏర్పాటుతోపాటు ఇతర పనులు పూర్తి కావడానికి మరో వారం రోజుల వరకు పట్టే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక, సమతా కేంద్ర సందర్శనకు టికెట్ ధరలను ప్రకటించిన నిర్వాహకులు.. ఐదేళ్లలోపు చిన్నారులను ఉచితంగా అనుమతిస్తారు. 6-12 ఏళ్ల లోపు చిన్నారులకు రూ. 75, ఆపై రూ. 150 ప్రవేశ రుసుముగా నిర్ణయించారు.

Related posts

రేపు భూమి స్పీడు తగ్గుతుందట!

Drukpadam

అర్ధరాత్రి గౌతమ్ అదానీ ట్వీట్.. సీఎం జగన్ తో చర్చించిన విషయాల వెల్లడి

Ram Narayana

ఉక్రెయిన్ పై రష్యా ఏ క్షణంలో అయినా దాడి చేయవచ్చు: అమెరికా భద్రతా సలహాదారు!

Drukpadam

Leave a Comment