Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఉక్రేయిన్ యుద్ధం ఆపాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ను కోరిన ప్రధాని మోదీ !

 రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభంపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌ అయింది. ఇదిలా ఉండగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్‌లో  గురువారం రాత్రి మాట్లాడారు. ఉక్రెయిన్ పై  యుద్ధం ఆపాలని ఆయనకు మోదీ సూచించారు. చర్చల ద్వారా  సమస్య పరిష్కరించుకోవాలని మోదీ పుతిన్‌కు తెలిపారు. అదేవిధంగా యుద్ధం కారణంగా ఉక్రెయిన్ లో ఇబ్బందులు పడుతున్న భారతీయ విద్యార్థుల క్షేమాన్ని ప్రధాని గుర్తు చేశారు.

ఉక్రెయిన్‌-రష్యా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ అత్యున్నత స్థాయి సమావేశంలో పాల్లొన్నారు. ఈ సమావేశంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటుగా జాతీయ భద్రతా సలహాదారు అజీత్‌ దోవల్‌ కూడా పాల్లొన్నారు. ఇక మరోవైపు ఉక్రెయిన్ విష‌యంలో ప్ర‌పంచ దేశాలు మాట్లాడ‌కూడ‌ద‌ని, జోక్యం చేసుకోకూడ‌ద‌ని పుతిన్ అన్ని దేశాలకు ముక్కు సూటిగా చెప్పేశారు.

ఉక్రెయిన్‌పై రష్యా మరణాహోమాన్ని ఆపడానికి భారత ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని ఆ దేశ రాయబారి ఇగోర్‌ పోలిఖా.. ప్రధాని మోదీని అభ్యర్థించారు. ప్రధాని మోదీ మాట్లాడిన తర్వాత ఎలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటాయోనని అన్ని దేశాలు వేచి చూస్తున్నాయి.

Related posts

టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ సెమీస్ లో సింధు ఓటమి!

Drukpadam

కోక్ తాగితే లైంగిక సామర్థ్యం పెరుగుతుందట.. తాజా అధ్యయనంలో వెల్లడి!

Drukpadam

టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత!

Drukpadam

Leave a Comment