Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

న‌ల్ల‌గొండలో కుప్ప‌కూలిన ఆర్మీ శిక్ష‌ణ హెలికాప్ట‌ర్.. ఇద్ద‌రి మృతి!

న‌ల్ల‌గొండలో కుప్ప‌కూలిన ఆర్మీ శిక్ష‌ణ హెలికాప్ట‌ర్.. ఇద్ద‌రి మృతి!

  • పెద్ద‌వూర మండ‌లం రామ‌న్న‌గూడెం తండా వ‌ద్ద ఘ‌ట‌న‌
  • పైల‌ట్‌తో పాటు మ‌హిళా ట్రైనీ పైల‌ట్ మృతి
  • భారీ శ‌బ్దం వినిపించింద‌న్న‌ స్థానికులు

న‌ల్ల‌గొండ జిల్లా పెద్ద‌వూర మండ‌లం రామ‌న్న‌గూడెం తండా వ‌ద్ద ఓ శిక్ష‌ణ హెలికాఫ్టర్ కుప్ప‌కూలింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. పైల‌ట్‌తో పాటు మ‌హిళా ట్రైనీ పైల‌ట్ మ‌హిమ‌ మృతి చెందిన‌ట్లు అధికారులు గుర్తించారు. మ‌హిళ త‌మిళ‌నాడుకు చెందిన అమ్మాయ‌ని చెప్పారు. ఆ ఇద్ద‌రి మృత‌దేహాలు గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మాంస‌పు ముద్ద‌లుగా ఉన్నాయి.

ఈ ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను విశ్లేషిస్తున్నట్లు తెలిపారు. హెలికాప్ట‌ర్ కూలిన స‌మ‌యంలో భారీ శ‌బ్దం వినిపించింద‌ని స్థానికులు చెప్పారు. ఆ ప్రాంతంలో మంట‌లు, పొగ‌లు వ‌చ్చిన‌ట్లు వివ‌రించారు. ఆ హెలికాప్ట‌ర్ నాగార్జున సాగ‌ర్ వైపు నుంచి వ‌చ్చిన‌ట్లు వివ‌రించారు. కాగా, ఆ హెలికాప్ట‌ర్ నాగార్జున సాగ‌ర్‌లోని విజ‌య‌పురి సౌత్ ఏవియేష‌న్ అకాడ‌మీకి చెందినదిగా అధికారులు గుర్తించారు.

Related posts

అబుదాభి ఎయిర్ పోర్టుపై ఉగ్రదాడి!

Drukpadam

రాజమౌళి, సుకుమార్‌, త్రివిక్రమ్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

Drukpadam

గోషా మహల్ నియోజకవర్గంలో ఒక్కసారిగా కుంగిపోయిన రోడ్డు… 

Drukpadam

Leave a Comment