Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

విశాఖలో పర్యటనలో సీఎం జగన్… ఆసక్తికరమైన ఫొటోలు !

విశాఖలో పర్యటనలో సీఎం జగన్… ఆసక్తికరమైన ఫొటోలు !

  • విశాఖలో మిలన్-2022
  • హాజరైన సీఎం జగన్
  • పరేడ్ ను ప్రారంభించిన వైనం
  • ఐఎన్ఎస్ వేలా జలంతర్గామి సందర్శన

ఏపీ సీఎం జగన్ విశాఖలో పర్యటిస్తున్నారు. ఆయన ఇవాళ విశాఖ ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన మిలన్ ఇంటర్నేషనల్ పరేడ్-2022 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ విశాఖపట్నం నౌకను జాతికి అంకితం చేశారు. నావల్ డాక్ యార్డులో ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామిని కూడా సందర్శించారు. తన పర్యటనలో భాగంగా ఆయన మిలన్ పరేడ్ ను ప్రారంభించారు.

ఈ పరేడ్ కు సతీసమేతంగా విచ్చేసిన సీఎం జగన్ సముద్రంలో నౌకల విన్యాసాలను, గగనతలంలో జెట్ ఫైటర్ విమానాల విన్యాసాలను తిలకించారు. పరేడ్ సందర్భంగా తూర్పు నావికాదళం సీఎం జగన్ కు గౌరవవందనం సమర్పించింది. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ నేవీ టోపీ ధరించడం విశేషం. అంతేకాదు, ఐఎన్ఎస్ వేలా జలాంతర్గామిలో ప్రవేశించిన ఆయన దాంట్లోని వ్యవస్థలను ఎంతో ఆసక్తిగా పరిశీలించారు

Related posts

ఎన్నికలు జరుపుతారా? వాయిదా వేస్తారా ? వారిష్టం కోర్ట్ జోక్యం చేసుకోదు…

Drukpadam

భారత ప్రధాని మోదీతో బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ మాటా మంతీ!

Drukpadam

హిజాబ్ వివాదంపై స్పందించిన పాకిస్థాన్ మంత్రులు…ఇది మా ఇంటి సమస్య మేము చూసుకోగలమన్న ఒవైసి !

Drukpadam

Leave a Comment