Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చ‌ర్చ‌ల్లో ర‌ష్యా, ఉక్రెయిన్ల డిమాండ్లు ఇవే!

చ‌ర్చ‌ల్లో ర‌ష్యా, ఉక్రెయిన్ల డిమాండ్లు ఇవే!

  • బెలార‌స్‌లో ఇరు దేశాల శాంతి చ‌ర్చ‌లు
  • నాటోలో చేర‌బోమ‌ని ఉక్రెయిన్ హామీ ఇవ్వాల‌న్న ర‌ష్యా
  • బ‌ల‌గాల‌ను ర‌ష్యా వెన‌క్కు పిలవాలంటున్న ఉక్రెయిన్‌
  • త‌క్ష‌ణ‌మే ర‌ష్యా కాల్పుల‌ను నిల‌పాల‌ని కూడా డిమాండ్‌
  • చ‌ర్చ‌ల‌కు తొలుత ర‌ష్యానే ప్ర‌తిపాద‌న‌
  • బెలార‌స్‌లో చ‌ర్చ‌ల‌కు ఉక్రెయిన్ తొలుత విముఖ‌త‌
  • తాజాగా అక్క‌డే చ‌ర్చ‌ల‌కు అంగీకారం
  • చ‌ర్చ‌ల ఫ‌లితంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి
యుద్ధంలో ఒకరికి ఒకరు త‌గ్గ‌కుండా ముందుకు సాగుతున్న ర‌ష్యా, ఉక్రెయిన్లు ఎట్ట‌కేల‌కు శాంతి చ‌ర్చ‌ల‌కు అంగీక‌రించాయి. ర‌ష్యా ప్ర‌తిపాదించిన‌ట్లుగానే బెలార‌స్‌లో కాసేప‌టి క్రితం ప్రారంభ‌మైన చ‌ర్చ‌ల్లో ఇరు దేశాల ప్ర‌తినిధులు పాల్గొన్నారు. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు కొన‌సాగుతుండ‌గా.. ఇరు దేశాలు త‌మ త‌మ వాద‌న‌ల‌కు క‌ట్టుబ‌డి.. వాటిని సాధించుకునే దిశగా ముందుకు సాగుతున్నాయి.
నాటో కూట‌మిలో చేర‌బోన‌ని ఉక్రెయిన్ బేష‌ర‌తుగా లిఖిత పూర్వ‌క హామీ ఇవ్వాల‌ని ర‌ష్యా ప‌ట్టుబ‌డుతోంది. అయితే ఇత‌ర విషయాలేమీ ప్రస్తావించని ఉక్రెయిన్‌.. త‌క్ష‌ణ‌మే ర‌ష్యా త‌న బ‌ల‌గాల‌ను వెన‌క్కు పిల‌వాల‌ని పట్టుబ‌డుతోంది. అంతేకాకుండా ర‌ష్యా త‌క్ష‌ణ‌మే కాల్పుల‌ను విర‌మించాల‌ని కూడా ఉక్రెయిన్ తేల్చిచెబుతోంది. వెర‌సి ఇరు దేశాలు ప్ర‌త్య‌ర్థి ప్ర‌తిపాద‌న‌ల‌పై ఎలాంటి స్పంద‌న తెలిజేయ‌కుండా.. త‌మ త‌మ వాద‌న‌ల‌ను వినిపించేందుకే మొగ్గు చూపుతున్నాయి. ఇలాంటి త‌రుణంలో ఈ చ‌ర్చ‌ల ఫ‌లితం ఎలా ఉంటుందోన‌న్న విష‌యంలో ఆసక్తి నెల‌కొంది.
  • ప్ర‌త్య‌క్ష యుద్ధంలో త‌ల‌ప‌డుతున్న ర‌ష్యా, ఉక్రెయిన్‌ల మ‌ధ్య కాసేప‌టి క్రితం చ‌ర్చ‌లు మొదల‌య్యాయి. బెలార‌స్ కేంద్రంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌ల్లో ఎలాంటి నిర్ణ‌యం వెలువడుతుందన్న విష‌యంపై ఇప్పుడు స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. బెలార‌స్‌లో ఇరు దేశాల మ‌ధ్య చ‌ర్చ‌ల‌కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన‌ట్గుగా అంత‌కుముందు బెలార‌స్ విదేశాంగ శాఖ ప్ర‌క‌టించింది.
ర‌ష్యాకు అనుకూలంగా వ్య‌వ‌హరిస్తున్న బెలార‌స్‌లో చ‌ర్చ‌ల‌కు తాము వ్య‌తిరేక‌మంటూ రెండు రోజుల క్రితం ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్ స్కీ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. చ‌ర్చ‌ల‌కు తొలుత ర‌ష్యానే ప్ర‌తిపాద‌న చేయ‌గా.. అందుకు అంగీక‌రించిన జెలెన్‌స్కీ చ‌ర్చ‌ల‌ను బెలార‌స్‌లో కాకుండా త‌ట‌స్థ వేదిక‌పై జ‌రిపితే ఆలోచిస్తామంటూ చెప్పారు. అయితే ర‌ష్యా భీక‌ర దాడుల‌తో ఉక్రెయిన్‌లో ప‌రిస్థితి నానాటికీ విష‌మిస్తున్న నేప‌థ్యంలో బెలార‌స్‌లోనే చ‌ర్చ‌ల‌కు జెలెన్‌స్కీ అంగీక‌రించిన‌ట్టు స‌మాచారం. కాసేప‌టి క్రితం బెలార‌స్‌లోనే మొదలైన చ‌ర్చ‌ల్లో ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Related posts

రెండు రోజులే ఛాన్స్‌.. ఛ‌లాన్ల క్లియ‌రెన్స్‌కు గ‌డువు పెంపు లేద‌ట‌!

Drukpadam

తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల.. 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్..!

Drukpadam

అత్యంత ఘనంగా బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం…

Drukpadam

Leave a Comment