Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌.. ధ‌ర‌ణి వ‌ల్లే రియ‌ల్ట‌ర్ల హ‌త్య‌!

రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌.. ధ‌ర‌ణి వ‌ల్లే రియ‌ల్ట‌ర్ల హ‌త్య‌!

  • ధ‌ర‌ణి పోర్ట‌ల్ మొత్తం త‌ప్పుల మ‌య‌మే
  • 20 ఏళ్ల క్రితం భూములు అమ్ముకున్న వారి పేరిటే ఇప్ప‌టికీ భూములు
  • సీఎం కేసీఆర్‌, సీఎస్ సోమేశ్ కుమార్‌లే బాధ్యులు
  • పోర్ట‌ల్‌లోని త‌ప్పుల కార‌ణంగా గొడ‌వ‌లు
  • టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

హైద‌రాబాద్ శివారు ప్రాంతం ఇబ్ర‌హీంప‌ట్నంలో మంగ‌ళ‌వారం జ‌రిగిన రియ‌ల్ ఎస్టేట్ బ్యాపారుల హ‌త్య‌కు తెలంగాణ ప్ర‌భుత్వం కొత్త‌గా తీసుకువ‌చ్చిన ధ‌ర‌ణి పోర్ట‌లే కార‌ణ‌మంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. భూవివాదం పరిష్కారం కోసం మాట్లాడుకుందామని పిలిచి కాల్పులు జరపగా.. ఒక రియల్టర్‌ ఘటనా స్థలంలోనే.. మరో రియల్టర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంగ‌తి తెలిసిందే. ఈ హ‌త్య‌కు సంబంధించి ద‌ర్యాప్తుయ మొద‌లెట్టిన పోలీసులు ఇప్ప‌టికే ప‌లువురు నిందితుల‌ను అరెస్ట్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

ఈ ఘ‌ట‌న‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి బుధ‌వారం నాడు సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. సీఎం కేసీఆర్‌, సీఎస్ సోమేష్‌ కుమార్‌ కలిసే ధరణి పోర్టల్‌ తెచ్చారని గుర్తుచేసిన ఆయన.. ఆ పోర్టల్‌లో మొత్తం తప్పులే ఉన్నాయని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోర్ట‌ల్‌లోని త‌ప్పుల కార‌ణంగా చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వ తప్పిదాలతోనే హత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇబ్రహీంపట్నంలో ఇద్దరు రియల్టర్లు హ‌త్య‌కు గుర‌య్యార‌ని.. ఈ హ‌త్య‌ల‌కు ప్రధాన కారణం ధరణి పోర్టల్‌లో లోపాలే ఆయ‌న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. 20 ఏళ్ల క్రితం భూములు అమ్ముకున్న వారి పేర్ల‌పైనే ఇంకా ఆ భూములు ఉన్న‌ట్లుగా ధ‌ర‌ణి పోర్ట‌ల్ చూపిస్తోందని.. దీంతో భూమి కొన్నవారు ఆగమై హత్యలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts

అజిత్​ పవార్​ తో ప్రభుత్వ ఏర్పాటు పెద్ద పొరపాటే: మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్​!

Drukpadam

హుజూరాబాద్ నివురుగప్పిన నిప్పులా ఉంది.. 2006 రిపీట్ అవుతుంది: ఈటల!

Drukpadam

ఆదిత్యనాథ్‌ పుట్టినరోజుకు మోదీ ట్విటర్‌లో శుభాకాంక్షలు చెప్పక పోవడంపై చర్చ…

Drukpadam

Leave a Comment