కేసీఆర్‌తో సుబ్రహ్మణ్య స్వామి, రాకేశ్ తికాయత్‌ల భేటీ
- కేసీఆర్ ఇంటికి ఇద్దరు నేతలు
- వారితో కలిసి లంచ్ చేసిన కేసీఆర్
- తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు
అందరూ ఊహించినట్లుగానే టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ స్థాయిలో స్పీడు పెంచారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు విపక్ష కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా కూటమి కట్టే దిశగా సాగుతున్న కేసీఆర్.. ఇప్పటికే మహారాష్ట్ర పర్యటనతో అందరి దృష్టిని తన వైపునకు మళ్లించేసుకున్నారు. తాజాగా మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన కేసీఆర్.. నేషనల్ పాలిటిక్స్‌లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం నాడు కేసీఆర్.. బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామితో పాటు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమాన్ని ముందుండి నడిపించిన బీకేయూ నేత రాకేశ్ తికాయత్‌లో భేటీ అయ్యారు. స్వామితో పాటు తికాయత్ స్వయంగా ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసానికే వచ్చారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కేసీఆర్..వారితో పలు రాజకీయ అంశాలపై చర్చించినట్టుగా సమాచారం.