Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

తెలంగాణ బడ్జెట్ 2,56,958 కోట్లు.. బడ్జెట్ హైలైట్స్ – 1

తెలంగాణ బడ్జెట్ 2,56,958 కోట్లు.. బడ్జెట్ హైలైట్స్ – 1

  • దళితబంధుకు రూ. 17,700 కోట్లు
  • పోలీస్ శాఖకు రూ. 9,315 కోట్లు
  • ఎస్టీ సంక్షేమం కోసం రూ. 12,565 కోట్లు

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ప్రజల ఆకాంక్షల మేరకు బడ్జెట్ ను రూపొందించామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. తెలంగాణను అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోయేలా బడ్జెట్ ను తయారు చేశామని చెప్పారు.

బడ్జెట్ ప్రసంగంలోని హైలైట్స్:

  • రాష్ట్ర బడ్జెట్ – రూ. 2,56,958 కోట్లు
  • రెవెన్యూ వ్యయం – రూ. 1,89,274.82 కోట్లు
  • క్యాపిటల్ వ్యయం –  రూ. 29,728.44 కోట్లు
  • దళితబంధుకు – రూ. 17,700 కోట్లు
  • దళితబంధు ద్వారా 11,800 కుటుంబాలకు లబ్ధి. అతి పెద్ద నగదు బదిలీ పథకంగా దళితబంధు రికార్డు సృష్టించింది.
  • పోలీస్ శాఖకు రూ. 9,315 కోట్లు
  • రూ. 75 వేల లోపు పంట రుణాల మాఫీ
  • రూ. 50 వేల లోపు రైతు రుణాలు ఈ నెల చివరిలోపు మాఫీ
  • ఎస్టీ సంక్షేమం కోసం రూ. 12,565 కోట్లు
  • బీసీ సంక్షేమం కోసం రూ. 5,698 కోట్లు
  • బ్రాహ్మణ సంక్షేమం కోసం రూ. 177 కోట్లు
  • కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ. 2,750 కోట్లు
  • ఆసరా పింఛన్ కోసం రూ. 11,728 కోట్లు
  • డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలకు రూ. 12,000 కోట్లు
  • మన ఊరు – మన బడి కార్యక్రమానికి రూ. 7,289 కోట్లు
  • హరితహారం పథకానికి రూ. 932 కోట్లు
  • రోడ్లు, భవనాల శాఖకు రూ. 1,542 కోట్లు
  • పామాయిల్ సాగుకు రూ. 1,000 కోట్లు
  • తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీలు. కొత్త మెడికల్ కాలేజీలకు రూ. 1,000 కోట్లు. రాబోయే రెండేళ్లలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం.

తెలంగాణ కొత్త రూపం సంతరించుకుంది: బడ్జెట్ ప్రసంగంలో హరీశ్ రావు

Telangana budget session begins

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిమంత్రి హరీశ్ రావు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ దేశంలో తెలంగాణ అగ్రగామిగా రూపుదాల్చిందని చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ఎన్నో అగచాట్లు పడ్డ తెలంగాణను పునర్నిర్మించే బాధ్యతను కేసీఆర్ తన భుజాలపై వేసుకున్నారని అన్నారు. పోరాట దశ నుంచి తెలంగాణ ఆవిర్భవించేంత వరకు ఎన్నో సమస్యలను అధిగమించామని చెప్పారు. పరిపాలనలో టీఆర్ఎస్ రాజీలేని వైఖరిని అవలంబించిందని అన్నారు.

రైతుబంధు, ఆసరా.. ఇలా ఏ పథకమైనా నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తోందని హరీశ్ తెలిపారు. కరెంట్ కోతలు, ఆకలి చావులు ఇప్పుడు లేవని చెప్పారు. దేశంలో తెలంగాణ ఓ టార్చ్ బేరర్ అని చెప్పారు. ఖజానాకు ఎంత ధనం చేరిందనేది ముఖ్యం కాదని… ప్రజలకు ఎంత మేలు జరిగిందనేదే ముఖ్యమని అన్నారు. తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి సరిగా లేదని విమర్శించారు. తెలంగాణ పురిటి దశలో ఉన్నప్పటి నుంచే కేంద్రం దాడి మొదలైందని దుయ్యబట్టారు.

రాష్ట్ర అప్పులు రూ. 3.30 లక్షల కోట్లు.. తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ – 2

  • telangana budget highlights

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ప్రజల ఆకాంక్షల మేరకు బడ్జెట్ ను రూపొందించామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇది బడుగుల జీవితాలను మార్చే బడ్జెట్ అని చెప్పారు. ముమ్మాటికీ కేసీఆర్ మార్క్ బడ్జెట్ అని తెలిపారు.

బడ్జెట్ ప్రసంగంలోని మరికొన్ని హైలైట్స్:

  • 2022-23 నాటికి రాష్ట్ర అప్పులు రూ. 3,29,998 కోట్లు
  • పన్ను ఆదాయం రూ. 1,08,212 కోట్లు
  • కేంద్ర పన్నుల్లో వాటా రూ. 18,394 కోట్లు
  • పన్నేతర ఆదాయం రూ. 25,421 కోట్లు
  • గ్రాంట్లు – రూ. 41,001 కోట్లు
  • అమ్మకం పన్ను అంచనా రూ. 33 వేల కోట్లు
  • ఎక్సైజ్ ద్వారా ఆదాయం రూ. 17,500 కోట్లు
  • స్టాంపులు, రిజిస్ట్రేషన్ ద్వారా ఆదాయం రూ. 15,600 కోట్లు
  • ముఖ్యమంత్రి పరిధిలో నిర్వాసితులు, ప్రమాద బాధితులకు ఇళ్ల కేటాయింపు
  • యాదాద్రి తరహాలో పుణ్యక్షేత్రాల అభివృద్ధి
  • పల్లె ప్రగతి ప్రణాళికకు రూ. 330 కోట్లు
  • అటవీ విశ్వవిద్యాలయానికి రూ. 100 కోట్లు
  • సొంత స్థలంలో రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం. 4 లక్షల మందికి సాయం. ప్రతి నియోజకవర్గంలో 3 వేల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం.
  • గిరిజన గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణాలకు రూ. 600 కోట్లు
  • హెచ్ఎండీఏ పరిధిలో మరో 94 బస్తీ దవాఖానాలు
  • కిడ్నీ రోగులకు 42 ఉచిత డయాలసిస్ కేంద్రాలు
  • వరంగల్ లో హెల్త్ సిటీ
  • ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు
  • అవయవ మార్పిడి చికిత్సలకు ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షలు
  • ఆక్సిజన్ ఉత్పత్తిని రోజుకు 135 నుంచి 550 టన్నులకు పెంపు
  • రాష్ట్రంలో 84 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందజేత
  • రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ సామర్థ్యం 17,305 మెగావాట్లు

వ్యవసాయ రంగానికి రూ. 24,254 కోట్లు.. తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ – 3

telangana budget highlights

2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ప్రజల ఆకాంక్షల మేరకు బడ్జెట్ ను రూపొందించామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం జాతీయ సగటు కంటే 86 శాతం అధికంగా ఉందని చెప్పారు.

బడ్జెట్ ప్రసంగంలోని ఇంకొన్ని హైలైట్స్:

  • కేసీఆర్ కిట్ పథకానికి రూ. 443 కోట్లు
  • ఉపకారవేతనాలకు రూ. 4,688 కోట్లు
  • ఆహార సబ్సిడీకి రూ. 2,787 కోట్లు
  • ఆర్టీసీకి రూ. 1,500 కోట్లు
  • ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ కు రూ. 1,343 కోట్లు
  • రీజనల్ రింగ్ రోడ్డుకు రూ. 500 కోట్లు
  • సచివాలయ భవనాల నిర్మాణానికి రూ. 400 కోట్లు
  • పరిశ్రమల ప్రోత్సాహానికి రూ. 2,519 కోట్లు
  • హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ. 1,500 కోట్లు
  • ఎయిర్ పోర్ట్, మెట్రో కనెక్టివిటీకి రూ. 500 కోట్లు
  • పాతబస్తీకి, మెట్రో కనెక్టివిటీకి రూ. 500 కోట్లు
  • మేకలు, గొర్రెల పంపిణీ పథకానికి రూ. 1,000 కోట్లు
  • ఎస్టీ నివాస ప్రాంతాల్లో నిర్మాణానికి రూ. 1,000 కోట్లు
  • పట్టణ ప్రగతికి రూ. 1,394 కోట్లు
  • పట్టణ ప్రాంతాల మిషన్ భగీరథకు రూ. 800 కోట్లు
  • కాళేశ్వరం ప్రాజెక్టు పర్యాటక వలయానికి రూ. 750 కోట్లు
  • సుంకిశాల ఇన్ టేక్ ప్రాజెక్టుకు రూ. 725 కోట్లు
  • పోలీస్ శాఖ భవనాల నిర్మాణానికి రూ. 648 కోట్లు
  • వ్యవసాయ రంగానికి రూ. 24,254 కోట్లు
  • రైతుబంధు తరహాలో నేత కార్మికులకు ప్రత్యేక పథకం
  • భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త పథకం. తొలి విడతలో లక్ష మంది కార్మికులకు మోటార్ సైకిళ్ల పంపిణీ
  • హైదరాబాద్ పరిధిలోని ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు రూ. 12.5 కోట్లు
  • విద్యుత్ సబ్సిడీలకు రూ. 10,500 కోట్లు
  • పరిశ్రమల విద్యుత్ రాయితీలకు రూ. 190 కోట్లు
  • పావలా వడ్డీ పథకానికి రూ. 187 కోట్లు
  • ఎస్టీ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ. 1,000 కోట్లు
  • మహిళా యూనివర్శిటీకి రూ. 100 కోట్లు

Related posts

మమతా బెనర్జీ కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ!

Drukpadam

బెంగాల్ సీఎంగా మూడవసారి ప్ర‌మాణ స్వీకారం చేసిన మ‌మ‌త బెన‌ర్జీ

Drukpadam

కర్నూలులో సజ్జలకు నిరసన సెగ… అడ్డుకున్న దళితసంఘాలు!

Drukpadam

Leave a Comment