రేపు అసెంబ్లీలో కీలక ప్రకటన చేయబోతున్నా: టీవీ దగ్గరే కూర్చోండి సీఎం కేసీఆర్!
-వనపర్తి జిల్లా నాగవరంలో సీఎం కేసీఆర్ సభ
-రేపు నిరుద్యోగులు టీవీలో తన ప్రకటన చూడాలన్న కేసీఆర్
-ఇక దేశం కోసం కొట్లాడుదామని పిలుపు
-తెలంగాణ సస్యశ్యామలం అయిందని వెల్లడి
రేపు పొద్దున్న అసెంబ్లీ లో నిరుద్యోగులకు ప్రకటన చేయబోతున్నా …నిరుద్యోగులకు తీపి కబురు చెప్పబోతున్న బంగారు తెలంగాణ కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాం . అందరు 10 గంటలకు చూడండి అని కేసీఆర్ వనపర్తి సభలో ప్రకటించారు.
తెలంగాణ కోసం కొట్లాడినం …ఆకలి చవులు లేవు …పాలముర్రు ఈ రోజు పాలు కారుతున్నాయి . దళిత బందు దళిత బిడ్డల భవిషత్ మారుస్తుంది వారు దేనైకైనా ఖర్చు చేసుకోవచ్చు . అధికారులు అనుమానాలు నివృత్తి చేస్తారని కేసీఆర్ స్పష్టం చేశారు . మంగళవారం వనపర్తిలో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు.
వనపర్తి జిల్లా అవుతుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు వనపర్తి జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని వెల్లడించారు. గతంలో పాలమూరు జిల్లాలో పరిస్థితులు చూస్తే కన్నీళ్లు వచ్చేవని అన్నారు. తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క వైద్య కళాశాల కూడా లేదని, తెలంగాణ వచ్చాక ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలమైందని వివరించారు.
హైదరాబాదు నుంచి గద్వాల దాకా ధాన్యపురాశులతో కళకళలాడుతోందని పేర్కొన్నారు. పాలమూరు జిల్లా పాలుగారుతోందని, తాను సంతోషం పట్టలేక పొలాల్లోకి వెళ్లి చూశానని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన తెలంగాణ బిడ్డలంతా తిరిగి వచ్చారని తెలిపారు. 11 రాష్ట్రాల నుంచి పనుల కోసం తెలంగాణకే వలస వస్తున్నారని అన్నారు. తెలంగాణలో త్వరలో అద్భుతమైన పల్లెలు రూపుదిద్దుకోనున్నాయని పేర్కొన్నారు.వాల్మీకి బోయలను గిరిజనుల్లో పెట్టాలి అని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి
దేశంలో గుడిని గుడిలో లింగాన్ని మింగేవాళ్ళు బయలు దేరారు … మత పిచ్చిగాళ్ళు దేశాన్ని ఆగం చేసేందుకు చూస్తున్నారు. నాకంఠంలో ప్రాణం ఉండగా మత పిచ్చిగాళ్ళ ఆటలు సాగనివ్వను అని ఉద్ఘాటించారు. మంచి కోసం ఎంతదూరమైనా పోదాం ….కులం మతం దరిద్రం మాట …బుద్ది తక్కు వ పార్టీలు , బుద్ది తక్కువ మనుషులు ….వారి విధానాలు ఎండగట్టాలి …ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి అని కేసీఆర్ అన్నారు ….
మోడీ లాంటి మత పిచ్చి ప్రభుత్వాన్ని బంగాళా ఖాతంలో కలపాలి …దుర్మార్గమైన పద్దతిలో దేశాన్ని నాశనం చేసేవాళ్లకు బుద్ది చెప్పాలని కేసీఆర్ పిలుపు నిచ్చారు .
మీరంతా నన్ను దేశ రాజకీయాల్లో వెళ్లామన్నారు కాబట్టి బంగారు భారత్ కోసం వెళుతున్నాను …మీ తెలంగాణ బిడ్డగా నన్ను దీవించామని కోరుతున్న అని అన్నారు . ఏవిధమైన తెలంగాణ ఆవిష్కారం అయిందో రేపు అసెంబ్లీలో చెప్పబోతున్నానని అన్నారు. తెలంగాణ కోసం ఎలా ఉద్యమం చేపట్టి కొట్లాడామో, దేశం కోసం కూడా అలాగే పోరాడదామని పిలుపునిచ్చారు. దేశం కోసం ప్రాణాలైనా అర్పిస్తానని ఉద్ఘాటించారు. ఈ సభలో మంత్రులు , నిరంజన్ రెడ్డి , శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి , పలువురు ఎంపీలు ,ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.