2024 ఎన్నికలతో ఈ ఫలితాలకు సంబంధంలేదన్న మమతా బెనర్జీ!-
-ఇవి ఆ ఎన్నికల ఫలితాలను నిర్దేశిస్తాయన్న వాదనలు చెల్లవన్న దీదీ
-నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయభేరి
-కాంగ్రెస్ సంయమనంతో వ్యవహరించాలని సూచన
-అఖిలేశ్ మనోధైర్యం కోల్పోరాదని సలహా
2024 లో జరిగే ఎన్నికలకు ఐదు రాష్ట్రాలలో జరిగిన ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కొట్టి పారేశారు . ఈ ఎన్నికల్లో అనేక అక్రమాలు జరిగాయని పేర్కొన్నారు. అందువల్ల ప్రతిపక్ష పార్టీల ఐక్యతను ఈ ఎన్నికలు చాటి చెప్పాయని విశదీకరించారు . ఇప్పటికైనా కాంగ్రెస్ తో సహా ప్రతిపక్ష పార్టీలు సమన్వయంతో వ్యవహరించాలని వితవు పలికారు .
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ ఫలితాలు చవిచూడడం పట్ల మమతా తన అభిప్రాయాలు పంచుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అందరం కలిసి పోటీ చేద్దామని కాంగ్రెస్ కోరుకుంటే, ఇప్పుడు తీవ్రంగా స్పందించడం మానుకోవాలని సలహా ఇచ్చారు. సానుకూల దృక్పథంతో వ్యవహరించాలని సూచించారు.
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం బీజేపీకి నష్టదాయకమే అవుతుందని దీదీ సూత్రీకరించారు. 2024 ఎన్నికల ఫలితాలను ఈ 2022 ఎన్నికల ఫలితాలు నిర్దేశిస్తాయన్న వాదనలు చెల్లవని ఆమె స్పష్టం చేశారు. అటు, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ భారీ విజయం సాధించడం పట్ల కూడా మమతా బెనర్జీ స్పందించారు. యూపీలో ఈవీఎం అక్రమాలు ముమ్మరంగా జరిగాయని ఆరోపించారు.
ఏమైనా, ఈ ఫలితాలతో సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ మనోస్థైర్యం కోల్పోరాదని అన్నారు. అఖిలేశ్ యాదవ్ కు ఈసారి ఓటింగ్ పెరిగిందని, 27 శాతం నుంచి 37 శాతానికి పెరిగిందని వివరించారు. ఈవీఎం యంత్రాలకు ఫోరెన్సిక్ పరీక్షలు జరిపేలా అఖిలేశ్ ఎన్నికల సంఘాన్ని కోరాలని సూచించారు. మమతా ఎన్నికల తరువాత ఎన్నికలకు ముందు మాటలకూ తేడా ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు . శివసేన ఎంపీ యూపీ లో అసదుద్దీన్ ఒవైసి , మాయావతి వల్లనే బీజేపీ గెలుపొందింది అన్నారు . దాదాపు 80 సీట్లలో ఎస్పీ కేవలం 500 ఓట్ల తేడాతోనే ఓడిపోయింది. మరో 134 స్థానాల్లో బీజేపీ 100 ఓట్లతో గెలవడం విశేషం ….