Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కేసీఆర్‌కు రూట్ నర్వ్ పెయిన్‌.. వారం రెస్ట్‌తో స‌రి: వైద్యులు

కేసీఆర్‌కు రూట్ నర్వ్ పెయిన్‌.. వారం రెస్ట్‌తో స‌రి: వైద్యులు
యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు వైద్య పరీక్షలు
స‌ర్వైక‌ల్ స్పైన్ ఎంఆర్ఐలో స‌మ‌స్య నిర్ధారణ ‌
రూట్ న‌ర్వ్ పెయిన్‌ను గుర్తించిన వైద్యులు
ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసుప‌త్రిలో చేరార‌న‌గానే గురువారం ఉద‌యం రాష్ట్రంలో క‌ల‌క‌లం రేగింది. అయితే కాసేప‌టికే కేసీఆర్‌కు పెద్ద‌గా అనారోగ్య స‌మ‌స్య‌లేమీ లేవ‌ని, ఓ వారం పాటు విశ్రాంతి తీసుకుంటే అంతా స‌ర్దుకుంటుంద‌ని య‌శోద ఆసుప‌త్రి వైద్యులు తేల్చేయ‌డంతో జ‌నం ఊపిరి పీల్చుకున్నారు.

అయినా కేసీఆర్‌కు ఏమైంది? ఆయ‌న‌కు ఏఏ ప‌రీక్ష‌లు చేశారు? ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి ఏమిటి? ఎన్ని రోజుల్లో కేసీఆర్ సాధారణ స్థితికి చేరుకుంటారు? అన్న విష‌యాల‌పై య‌శోద ఆసుప‌త్రి వైద్యులు స్పష్టంగా ఓ ప్ర‌క‌ట‌న చేశారు.

ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం గ‌డ‌చిన రెండు రోజులుగా కేసీఆర్ నీరసంగా ఉన్నారట‌. ఎడమ చేయి లాగుతున్నట్లుగా ఉందని గురువారం ఉద‌యం స్వ‌యంగా కేసీఆరే ఫోన్ చేసి చెప్పార‌ట‌. ఆసుపత్రికి వచ్చి పరీక్షలు చేసుకోవాలన్న వైద్యుల సూచ‌న‌ను కేసీఆర్ ఒప్పుకున్నార‌ట‌.

త‌మ సూచ‌న మేర‌కు గురువారం ఉద‌యం య‌శోద ఆసుప‌త్రికి కేసీఆర్ రాగా… ఆయ‌న‌కు తొలుత ఈసీజీ, ఆ తర్వాత 2డి ఎకో పరీక్షలు నిర్వహింరు. ఈసీజీ, 2డి ఎకో పరీక్షల్లో అంతా నార్మల్‌గా ఉన్నట్లు తేలింది. ఎందుకైనా మంచిదని యాంజియోగ్రామ్‌ చేశారు. ఆ పరీక్షల్లో ఎలాంటి బ్లాక్‌ లేదని తేలింది.

ఇక ఎడమ చేయి ఎందుకు లాగుతుందన్న కారణంగా ఎంఆర్‌ఐ చేశారు. మెడకు సంబంధించి ఎంఆర్‌ఐ, అలాగే బ్రెయిన్‌ ఎంఆర్‌ఐ కూడా చేశారు. స‌ర్వైక‌ల్ స్పైన్ ఎంఆర్‌ఐలో కొంత రూట్‌ నర్వ్‌ పెయిన్‌ ఉన్నట్లు గమనించారు. చివరికి వారం రోజుల విశ్రాంతితో సీఎం కేసీఆర్ నార్మల్‌ అవుతారని వైద్యులు తేల్చేశారు.

రూట్ న‌ర్వ్ పెయిన్.. అది కూడా స్వ‌ల్ప స్థాయిలోనే ఉన్న స‌మ‌స్య మిన‌హా అన్ని ప‌రీక్ష‌ల్లోనూ మ‌రెలాంటి స‌మ‌స్య బ‌య‌ట‌ప‌డ‌లేదు. ఎందుకైనా మంచిద‌ని షుగర్, బీపీ పరీక్షలు కూడా చేశారు. వాటిలో కొద్దిగా హెచ్చుత‌గ్గులు క‌నిపించ‌డంతో కంట్రోల్‌లో ఉండడానికి సూచనలిచ్చారు. ప్రస్తుతానికి పెద్ద సమస్య ఏం లేదని నిర్ధారించిన వైద్యులు.. వారం పాటు విశ్రాంతి తీసుకుంటే స‌రిపోతుంద‌ని కేసీఆర్‌కు సూచించారు.

Related posts

చంద్రబాబు కంటతడి పెట్టుకోవడం నన్ను కలచివేసింది: వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

Drukpadam

ఇప్పటికీ తేరుకోని మణిపూర్.. అస్తవ్యస్తంగానే జనజీవనం…

Drukpadam

జర్మనీ అధీనంలో భారతీయ బాలిక.. స్వదేశానికి పంపించాలంటూ కేంద్రం ఒత్తిడి…

Drukpadam

Leave a Comment