Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రేవంత్ రెడ్డి-జగ్గారెడ్డి ఆత్మీయ కరచాలనం… 20 నిమిషాలకు పైగా భేటీ!

రేవంత్ రెడ్డి-జగ్గారెడ్డి ఆత్మీయ కరచాలనం… 20 నిమిషాలకు పైగా భేటీ!
-ఇటీవల కాలంలో రేవంత్ పై జగ్గారెడ్డి విమర్శలు
-సీఎల్పీ కార్యాలయంలో ఆశ్చర్యకర ఘటన
-పరస్పరం ఎదురుపడ్డ రేవంత్, జగ్గారెడ్డి
-మీడియా కెమెరాలకు పోజులు!

ఇటీవల కాలంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిత్యం విమర్శలు చేస్తూ ,పార్టీ నుంచి బయటికి పోతారా ? అనే రేంజ్ లో విమర్శలు చేసిన జగ్గారెడ్డి ,పీసీసీ చీఫ్ తో చెట్టాపట్టాల్ వేసుకొని ఫోటోలకు పోజులు ఇవ్వడం అందరిని ఆశ్చర్య పరిచింది. సీఎల్పీ కార్యాలయంలో ఇద్దరు నేతలు తారసపడటం ఒకరినొకరు ఆత్మీయ పలకరింపులు మీడియా వారిని సైతం ఆశ్చర్య పరిచాయి.

తెలంగాణ కాంగ్రెస్ లో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇవాళ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్న జగ్గారెడ్డి… నేడు రేవంత్ రెడ్డితో ఎంతో సానుకూల ధోరణితో మాట్లాడతాడని ఎవరూ ఊహించలేదు. అసెంబ్లీ సమావేశం నేపథ్యంలో సీఎల్పీ కార్యాలయం వద్ద ఇరువురు పరస్పరం ఎదురుపడ్డారు. దాంతో జగ్గారెడ్డి మర్యాదపూర్వకంగా ఆయనను పలకరించారు.

అందుకు రేవంత్ ఆత్మీయంగా స్పందించారు. పార్టీ సీనియర్ అయిన జగ్గారెడ్డితో కరచాలనం చేశారు. దాంతో మీడియా ప్రతినిధులు ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించారు. అనంతరం, రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి 20 నిమిషాలకు పైగా సమావేశం అయ్యారు. అయితే, రేవంత్ తో ఏం చర్చించారన్న విషయం జగ్గారెడ్డి బయటికి పొక్కనివ్వలేదు. అటు, రేవంత్ సైతం సమావేశం వివరాలను పంచుకోలేదు.

Related posts

మీడియాకు ఎక్కి ర‌చ్చ చేయొద్దు!… టీ కాంగ్రెస్ నేత‌ల‌కు మాణిక్కం ఠాగూర్ వార్నింగ్‌!

Drukpadam

ఇదేమి ప్రతిపక్షం …ఇదెక్కడి భాష …ఇల్లేమి నాయకులు:సీఎం జ‌గ‌న్!

Drukpadam

చంద్రబాబు పవన్ భేటీ …జగన్ సర్కారుపై సమరశంఖం..

Drukpadam

Leave a Comment