Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జూమ్ కాల్ ద్వారా 800 మంది ఉద్యోగులను తొలగించిన పీఅండ్‌‌వో ఫెర్రీస్

  • మూడు నిమిషాలపాటు సాగిన జూమ్‌కాల్
  • ఇదే ఆఖరు రోజంటూ ఉద్యోగులకు షాక్
  • సంస్థ కార్యాలయం వద్ద ఉద్యోగుల ఆందోళన

ఈ ప్రపంచంపై కరోనా దాడి తర్వాత ఉద్యోగులకు భద్రత కొరవడింది. నష్టాలు మూటగట్టుకుంటున్న కంపెనీలు ఎప్పుడు ఎవరిని తొలగిస్తాయో తెలియని అనిశ్చితి నెలకొంది. గతంలో ఉద్యోగం నుంచి తొలగించాలంటే పింక్‌స్లిప్‌లు జారీ చేసేవారు. కానీ ఇప్పుడదేమీ లేదు. ఉద్యోగులకు జూమ్ కాల్ చేసి ఉద్యోగం నుంచి తీసేస్తున్నట్టు చెబుతున్నారు. ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. 

తాజాగా బ్రిటన్ కంపెనీ పీఅండ్‌వో ఫెర్రీస్ కూడా ఇలానే చేసింది. 800 మంది ఉద్యోగులకు నెల 17న జూమ్ కాల్ చేసి తొలగిస్తున్నట్టు చెప్పింది. సంస్థ వ్యవహారాలను థర్డ్ పార్టీకి అప్పగించామని, కాబట్టి ఇక మీరు దయచేయొచ్చని చెబుతూ వారిని షాక్‌కు గురిచేసింది. మూడు నిమిషాలు మాత్రమే సాగిన ఈ జూమ్‌కాల్‌ ద్వారా 800 మందిని రోడ్డున పడేసింది. ఉద్యోగానికి ఇదే ఆఖరి రోజని, సెటిల్‌మెంట్ ప్రయోజనాలన్నీ త్వరలోనే అందిస్తామని సంస్థ తెలిపింది. 

ఈ హఠాత్ పరిణామానికి నివ్వెరపోయిన ఉద్యోగులు చెప్పాపెట్టకుండా ఉద్యోగం నుంచి ఎలా తీసేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ లండన్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అయితే, సంస్థ వాదన మాత్రం మరోలా ఉంది. ఉద్యోగులందరికీ ఈమెయిల్, కొరియర్, టెక్స్ట్ మెసేజీల ద్వారా సమాచారాన్ని అందించామని చెబుతోంది.

Related posts

చంద్ర‌బాబు ప్ర‌మాణ స్వీకారం 12న ఉద‌యం 11.27 గంట‌ల‌కే…

Ram Narayana

How To Avoid Getting Fat When Working From Home

Drukpadam

లండ‌న్‌లో కేటీఆర్‌… పారిశ్రామిక దిగ్గ‌జాల‌తో రౌండ్ టేబుల్ సమావేశం!

Drukpadam

Leave a Comment