రాజకీయ వార్తలు

3 రాజ‌ధానులే మా విధానం.. స‌భ‌లో బిల్లు పెడ‌తాం: బొత్స …

3 రాజ‌ధానులే మా విధానం.. స‌భ‌లో బిల్లు పెడ‌తాం: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌!
-రాష్ట్ర స‌మ‌గ్రాభివృద్ధే మా ల‌క్ష్యం
-పాల‌నా వికేంద్రీక‌ర‌ణకు క‌ట్టుబ‌డి ఉన్నాం
-పార్టీతో పాటు ప్ర‌భుత్వ నిర్ణ‌యం అదేన‌న్న బొత్స‌

మూడు రాజధానులపై పంచాయతీ ఇంకా తెగలేదు … ఒకపక్క కోర్ట్ అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలనీ చెప్పినప్పటికీ ,అమరావతితో పాటు విశాఖ , కర్నూల్ లులలో న్యాయ , పరిపాలన రాజధానులు ఏర్పాటు తమ ప్రభుత్వ విధానమని రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు . పరిపాలన వికేద్రీకరకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు .

ఏపీకి మూడు రాజ‌ధానులు అన్న విధానానికే తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ మ‌రోమారు స్ప‌ష్టం చేశారు. మంగ‌ళ‌వారం నాడు అమ‌రావ‌తిలో మీడియాతో మాట్లాడిన సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

రాష్ట్రానికి మూడు రాజ‌ధానులు తమ పార్టీ, ప్రభుత్వ విధానమ‌ని చెప్పిన ఆయ‌న‌.. పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామ‌ని పేర్కొన్నారు. సమయాన్ని బట్టి సభలో బిల్లు ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు. మొదటి నుండి మూడు రాజ‌ధానుల మాటే చెబుతున్నామ‌న్న బొత్స‌.. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే త‌మ‌ లక్ష్యమ‌ని పేర్కొన్నారు.

ఇత‌ర‌త్రా అంశాల‌పైనా స్పందించిన బొత్స.. స్మార్ట్ సిటీ పదవులకు రాజీనామా చేసినవారికి ఇంకా పెద్ద పదవులు ఇస్తామేమో? అని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయ సమస్యలపై ఎమ్మెల్సీలతో చర్చించామ‌నీ… అన్నీ పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. మున్సిపల్ స్కూళ్ల‌లో టీచర్ల సంఖ్య పెంచమని కొన్ని సంఘాలు అడిగాయ‌న్న ఆయ‌న ఆ దిశ‌గానూ చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

Related posts

‘ఇండియా’ కూటమి నిన్నటి సెమీఫైనల్స్ లోనే ఓడిపోయింది: ప్రధాని మోదీ ఎద్దేవా

Ram Narayana

బీఆర్ యస్ అవినీతి పార్టీ దానితో యుద్ధమే … షర్మిల

Drukpadam

తెలంగాణ లో కింగ్ మేకర్ పాత్ర పోషించేందుకు సొంత పార్టీ ఆలోచనలో పొంగులేటి ఉన్నట్లు ప్రచారం….

Drukpadam