Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

సికింద్రాబాద్ బోయగూడలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం!

సికింద్రాబాద్ బోయగూడలో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం!
-టింబర్ డిపోలో అగ్నిప్రమాదం
-ప్రమాద సమయంలో డిపోలో 12 మంది
-ప్రాణాలతో బయటపడిన ఒక్కరు
-షార్ట్ సర్క్యూటే కారణం
-ప్రమాదం పై ప్రధాని మోడీ , కేసీఆర్ దిగ్బ్రాంతి
-రాష్ట్రప్రభుత్వం 5 లక్షలు , కేంద్రం 2 లక్షల ఎక్స్ గ్రేషియా

సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బోయగూడ ఐడీహెచ్ కాలనీలోని టింబర్, తుక్కు డిపోలో జరిగిన ఈ ఘటనలో 11 మంది వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ప్రమాద సమయంలో మొత్తం 12 మంది కార్మికులు ఉన్నారు. వీరంతా గత రాత్రి అందులోనే నిద్రపోయారు.

ఉదయం షార్ట్‌సర్క్యూట్ కారణంగా డిపోలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో నిద్రిస్తున్న 12 మందిలో 11 మంది మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. బాధితులను బీహార్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మృతదేహాలను వెలికి తీశారు. అక్కడనుంచి వారిని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు .పోస్టుమార్టం అనంతరం ప్రత్యేకంగా మూడు విమానాల్లో మృతదేహాలను బీహార్ రాజధాని పాట్నా తరలించనున్నారు . అక్కడ నుంచి వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేశారు .

బోయగూడ ప్రమాదంపై కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి..
బాధిత కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం

సికింద్రాబాద్ బోయగూడలోని ఓ టింబర్, స్క్రాప్ దుకాణంలో ఈ తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు. ఈ ఘటనలో 11 మంది బీహార్ వలస కార్మికులు సజీవ దహనం కావడంతో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. వారి మృతదేహాలను బీహార్ పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు.

షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం సంభవించినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమాద సమయంలో అందులో 15 మంది నిద్రిస్తుండగా ఇద్దరు వ్యక్తులు బయటపడ్డారు. 11 మంది మృతి చెందారు. మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సికింద్రాబాద్ అగ్నిప్ర‌మాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి!

మృతుల కుటుంబాలకు సంతాపం
రెండు లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన ప్రధాని

సికింద్రాబాద్ బోయగూడలోని ఓ టింబర్, స్క్రాప్ దుకాణంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 11 మంది బీహార్ వలస కార్మికులు సజీవ దహనం అయిన విష‌యం తెలిసిందే. దీనిపై ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. ఆయా కుటుంబాలకు రెండు లక్షల రూపాయ‌ల‌ చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు.

మ‌రోవైపు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా మృతుల కుటుంబాల‌కు సానుభూతి తెలిపారు. అగ్ని ప్రమాదంలో వలస కార్మికుల సజీవ దహనం బాధాకరమ‌ని అన్నారు. ఈ ఘ‌ట‌న త‌న‌ను తీవ్రంగా క‌ల‌చివేసింద‌ని చెప్పారు. ఉపాధి కోసం బీహార్ నుంచి వ‌ల‌స వ‌చ్చిన కూలీలు ఈ దుర్ఘ‌ట‌న‌లో మృత్యువాత ప‌డ‌డం అత్యంత దుర‌దృష్ట‌క‌ర‌మంటూ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆయా కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాన‌ని చెప్పారు.

సికింద్రాబాద్ అగ్ని ప్ర‌మాదంలో కూలీల‌ మృతి ఎంతో క‌ల‌చివేసిందని వైఎస్సార్ టీపీ అధినేత్రి ష‌ర్మిల పేర్కొన్నారు. బాధిత కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలుపుతున్న‌ట్లు చెప్పారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వానిదేన‌ని అన్నారు. బాధిత కుటుంబాల‌కు న‌ష్ట ప‌రిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా, ఘోర అగ్ని ప్రమాదం ఘ‌‌ట‌న‌పై తెలంగాణ ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా ఉంది. స్క్రాప్ గోదాం ఘటనపై అధికారులతో మాట్లాడామ‌ని హోంమంత్రి మహమూద్ అలీ చెప్పారు. కాసేప‌ట్లో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, విజిలెన్స్ అధికారులతో సమావేశమవుతామని తెలిపారు. గోదాం యజమాని నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు. ఆయ‌న‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఖర్చులతోనే మృతదేహాలను బీహార్‌కు తరలిస్తామన్నారు. ఇలాంటి గోదాంలు న‌గ‌రంలో ఎన్ని ఉన్నాయో తెలుసుకుని, రక్షిత చర్యలు తీసుకుంటామన్నారు.

Related posts

మన పోచంపల్లి అంతర్జాతీయ ఉత్తమ పర్యాటక గ్రామం …

Drukpadam

వరద ముంపు ప్రాంతాలకు వెళ్లకుండా సీఎల్పీ బృందాన్ని అడ్డుకున్న పోలీసులు

Drukpadam

తాలిబన్లకు భారీ షాక్: అఫ్గాన్ అధ్యక్షుడు తానేనన్న అమ్రుల్లా సాలే!

Drukpadam

Leave a Comment