Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

అటు కేంద్రం ఇటు రాష్ట్రం ప్రజలపై బాదుడే బాదుడు!

అటు కేంద్రం ఇటు రాష్ట్రం ప్రజలపై బాదుడే బాదుడు!
-పెట్రోల్ ,డీజిల్ ,గ్యాస్ లపై కేంద్రం విద్యుత్ చార్జీల పేరుతో రాష్ట్రం
-ఇది కాక విద్యుత్ మీటర్లకు అదనంగా వడ్డనలు
-లబోదిబో మంటున్న ప్రజలు …స్పందలేని పాలకులు
-ధాన్యం కొనుగులుపై పరస్పరం నిందలు
-రైతులకు కుచ్చుటోపీ పెట్టనున్నారా ?

నిత్యం ప్రజల మేలుకోసం కృషి చేస్తున్నామని చెపుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలాంటివి ఏమి చేయకపోగా ప్రజలపై భారాలు మోపడం దారుణంగా ఉంది. పెట్రోల్ ,డీజిల్ ,గ్యాస్ లపై కేంద్రం వడ్డించగా , విద్యుత్ చార్జీల పెంపుతో పాటు విద్యుత్ మీటర్లకు అదనంగా భారాలు మోపడంపై ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వడ్ల కొనుగులుపై ఇప్పటికే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు . తప్పు మీదంటే మీదేనని వాదులాడుకుంటున్నారు .మంత్రులే కత్తులు దూసుకుంటున్నారు . కేంద్ర మంత్రి రాష్ట్రం రైతులను మోసం చేస్తుందని అంటే ,కేంద్రం రాష్ట్రానికి రాష్ట్రానికి వివక్షతతో , పక్షపాతం చూపిస్తూ రైతులను నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై విరుచుకుపడుతుంది. ఇరువురు కలిసి రైతులకు కుచ్చుటోపీ పెట్టనున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ప్రజలకు మేలు చేస్తామని నిత్యం గొంతు చించుకొని పాలకులు ప్రజలను మాత్రం దగా చేస్తున్నారు . ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా పెట్రో చార్జీల ఊసెత్తని కేంద్రం అయి అవి అయిపోగానే పెద్ద ఎత్తున వడ్డనలు శ్రీకారం చుట్టింది. రూ 15 వరకు పెట్రోల్ ,డీజిల్ రేట్లు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్న పాలకులు ఒక్కసారే పెంచితే ప్రజల నుంచి చెడ్డపేరు వస్తుందని రోజుకు రూపాయికి తక్కువగా 90 పైసలు , 87 పైసలు అంటూ నెమ్మదిగా తాము అనుకున్న విధంగా ప్రజల పై భారాలు మోపుతోంది. వరసగా మూడవరోజు పెట్రోల్ రేట్లు పెంచారు . పెట్రో రేట్లపై ఆందోళనలు చేస్తున్న ప్రతిపక్షాలు సైతం రోజు ఆందోళనలు చేయలేక చతికిల పడ్డాయి. ఒకవేళ చేస్తున్న ఆందోళనలకు సైతం ప్రజల నుంచి అనుకున్న సహకారం లభించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదే జర్మనీ లో పెట్రో రేట్లు పెరిగితే వాహనాలు అన్ని రోడ్లపై విడిచిపెట్టి వినూత్న నిరసన తెలిపారు . దీంతో దిగివచ్చిన జర్మనీ ప్రభుత్వం పెంచిన రేట్లను దించక తప్పలేదు .

తెలంగాణాలో భారీగా విద్యుత్ చార్జీల వడ్డన

తెలంగాణ ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ చార్జీల పెంపుకు రంగం సిద్ధం చేసింది. గృహ వినియోగదారులకు యూనిట్ కు 50 పైసల చొప్పున , హైటెన్షన్ వినియోగదారులకు యూనిట్ కు రూపాయ చొప్పున పెంచనున్నారు . కేంద్రం పెట్రోల్ , డీజల్ ,గ్యాస్ లపై పెంచితే , రాష్ట్రం విద్యుత్ పై పంచి ప్రజల నడ్డివిరుస్తున్నాయి . మూలిగే నక్కపై తాటికాయ చందంగా భారాలు ఉన్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు . ప్రజలకు మేలు చేస్తున్నామని చెపుతున్న పాలకులు భారాలు మోపి బతుకు దుర్భరం చేస్తున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు .

Related posts

Here Are 5 Ways You Can Get Younger-looking Skin Right Now

Drukpadam

మార్చి 31 నుంచి ఐపీఎల్… మళ్లీ పాత పద్ధతిలోనే పోటీలు!

Drukpadam

షర్మిలకు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన కోర్టు…

Drukpadam

Leave a Comment