జగన్ క్యాబినెట్ నుంచి 90% మంది మంత్రులు అవుట్ అనే సంకేతాలు !
-మంత్రులలో టెన్షన్ …టెన్షన్ ….
-ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు?
-ఏప్రిల్ 11న చేపడతారని ప్రచారం
-మార్పులపై ఇప్పటికే స్పష్టతకు వచ్చిన సీఎం!
-ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం
-ఎవరు ఇన్ ఎవరు అవుట్ అనేది సర్వత్రా ఆశక్తి
ఏపీ మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై ఎప్పటినుంచి ఊహాగానాలు మొదలయ్యాయి. మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. దీంతో ఎవరు ఇన్ ఎవరు అవుట్ అనే ఆశక్తి సర్వత్రా నెలకొన్నది . సీఎం జగన్ కూడా మంత్రి పదవులు ఇచ్చేటప్పుడే రెండున్నర ఏళ్ళు కాలపరిమితి విధించారు . తరువాత కొత్తవారికి అవకాశం ఇస్తానని కూడా స్పష్టం చేశారు . అందుకు ముహూర్తం రానే వచ్చింది . దాదాపు ముగ్గురు నలుగురు మినహా అందరిపదవులు పోవడం ఖాయమనే సంకేతాలు అందటం తో ఎవరు ఉంటారు ఎవరు పోతారనే ఆశక్తికర చర్చకు ఆస్కారం ఏర్పడింది. తమపేర్లు ఉంటున్నాయా లేదా అనే సందిగ్ధం వారిలో నెలకొన్నది కొందరు మంత్రులు టెన్షన్ పడుతున్నారు . తమకు అవకాశం ఉంటుందా లేదా అని ఆరా తీసే పనిలో పడ్డారు . కొత్తవారు తమకు అవకాశం ఇవ్వాలనే కోరుతున్నారు .
ఏప్రిల్ 11న సీఎం జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేయనున్నట్టు వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో మార్పులకు సంబంధించి జగన్ ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చినట్టు సమాచారం.
వాస్తవానికి మంత్రివర్గం రెండున్నరేళ్లే ఉంటుందని, ఆ తర్వాత కొత్తవారికి అవకాశం ఇస్తామని సీఎంగా జగన్ బాధ్యతలు తీసుకున్న 2019లోనే పేర్కొన్నారు. ఆ క్రమంలోనే ఇప్పుడు కేబినెట్ ను పునర్వ్యవస్థీకరిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడున్న వారిలో 90 శాతం మంది తమ బెర్తులను కోల్పోబోతున్నారని అంటున్నారు.
ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆశావహులు..
తొలి విడతలో అవకాశం దక్కని వారికి రెండో విడతలో అవకాశం ఇచ్చేందుకు జగన్ కసరత్తులు చేస్తున్నారని అంటున్నారు. దీంతో చాలా మంది ఆశావహులు తమకు అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు చాలా మంది మంత్రుల్లో తమ పదవి పోతుందన్న భయం పట్టుకుందని చెబుతున్నారు.
అయితే, పదవులు పోయిన వారికి జిల్లాలకు ఇన్ చార్జి బాధ్యతలు అప్పగిస్తామని, పార్టీ కోసం పనిచేయాలని ఇదివరకే మంత్రులకు జగన్ సూచించారు.