ప్రయాణికులకు శుభవార్త …ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కు గ్రీన్ సిగ్నల్!
-గత రెండు సంవత్సరాలుగా నిలిచిపోయిన విమానాలు
-కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు విడుదల
-సిబ్బందికి పూర్తి స్థాయి పీపీఈ కిట్ అవసరం లేదు.
-విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది నిర్వహించే పాట్ డౌన్ సోదాలు మళ్లీ ప్రారంభం.
-విమానాశ్రయం లేదా విమానంలో మాస్క్ ధరించడం మాత్రం తప్పనిసరి.
కరోనా మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలుగా నిలిచిపోయిన అంతర్జాతీయ విమానాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నలు ఇచ్చింది. దీంతో ఇది అంతర్జాతీయ ప్రయాణికులకు శుభపరిణామంగా మారింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నా ప్రయాణికులు కేంద్రం నిర్ణయంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకనుంచి రెగ్యులర్ గా అంతర్జాతీయ విమానాలు నడవనున్నాయి. అయితే ప్రయాణికులు మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని నిబంధన పెట్టారు .
కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, రేపటి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వ కొత్త మార్గదర్శకాలు ఇవే:
సిబ్బందికి పూర్తి స్థాయి పీపీఈ కిట్ అవసరం లేదు.
విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది నిర్వహించే పాట్ డౌన్ సోదాలు మళ్లీ ప్రారంభం.
అంతర్జాతీయ విమానాలలో 3 సీట్లను ఖాళీగా ఉంచడంపై పరిమితి ఎత్తివేత.
విమానాశ్రయం లేదా విమానంలో మాస్క్ ధరించడం మాత్రం తప్పనిసరి.
కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ వాణిజ్య ప్రయాణికుల విమానయాన సంస్థల నిర్వహణను భారత ప్రభుత్వం నిలిపివేసింది. వ్యాక్సినేషన్ వల్ల కరోనా మహమ్మారి కట్డడిలోకి వచ్చింది. దీంతో, మళ్లీ సర్వీసులను భారత ప్రభుత్వం పునఃప్రారంభిస్తోంది.