Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అధికారపార్టీ ఆటంకాల మధ్య మాజీ ఎంపీ పొంగులేటి పినపాక పర్యటన!

అధికారపార్టీ ఆటంకాల మధ్య మాజీ ఎంపీ పొంగులేటి పినపాక పర్యటన!
-పినపాక నియోజకవర్గంలో మాజీ ఎంపీ పొంగులేటికి జననీరాజనం
-ఆయన వెంట పరుగులు తీసిన జనం
-ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు సైతం పొంగులేటి వెంట
-ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరక్టర్ తుళ్లూరు బ్రమ్మయ్య
-పినపాక జడ్పీటీసీ కొమరం కాంతారావు
-గిరిజన గ్రామాలను చుట్టిన పొంగులేటి
-ప్రజాహితమే నా అభిమతం ఉద్ఘాటన
-మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
-పినపాక నియోజకవర్గంలో పర్యటన

అధికారపార్టీ లో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారపార్టీ ఆటంకాల మధ్య ఏజన్సీ ఏరియాలోని పినపాక నియోజకవర్గంలో పర్యటించారు . ఆయన పర్యటనకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించడం విశేషం . ప్రజలు నీరాజనాలు పలికారు ఆయనతో వెంట పినపాక మాజీ ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు , తాటివెంకటేశ్వర్లు ,డీసీసీబీ డైరక్టర్ తుళ్లూరు బ్రమ్మయ్య , పినపాక జడ్పీటీసీ కొమరం కాంతారావు ఇతర నాయకులు ఉన్నారు . ఈ పర్యటనకు ముందు రోజు టీఆర్ యస్ కు చెందిన స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు అనుయాయిలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పొంగులేటి పర్యటనకు ఎవరు వెళ్లవద్దని హుకుం జారీచేశారు . అయినప్పటికీ ప్రజలు పర్యటనకు వెళ్లకుండా నిరోధించలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి . దీంతో అధికార పార్టీలో ఉన్న గ్రూప్ తగాదాలు మరోసారి రచ్చకెక్కాయి. పొంగులేటి ప్రభావం ఈ నియోజకవర్గం పై కూడా ఉంటుందని స్థానికంగా అనేకమంది ఆయనకు అనుయాయులు ఉన్నారనే చర్చ జరుగుతుంది.

ప్రజాహితమే తన అభిమతమన్న పొంగులేటి ….

ప్రజాహితమే తన అభిమతమని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం పర్యటనలో భాగంగా పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం, పినపాక మండలాల్లో పర్యటించారు. కొత్తగూడెం, గొల్లగూడెం, కొత్తూరు, అనంతారం, మొగిలితోగు, పద్మాపురం, రఘునాథపాలెం, సీతారాంపురం, కరకగూడెం, సమత్ బట్టుపల్లి, బట్టుపల్లి, రేగళ్ళ, వీరాపురం, కలవల నాగారం, కన్నాయి గూడెం, బంగారుగూడెం, పినపాక గ్రామాలను పొంగులేటి సందర్శించారు. పొంగులేటి నియోజవర్గానికి విచ్చేసిన సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పొంగులేటి ఆయా గ్రామాల్లో ఇటీవల చనిపోయిన పలువురు వ్యక్తుల కుటుంబాలను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. వివిధ ప్రమాదాల్లో గాయపడిన వారిని పరామర్శించి ఉచిత వైద్య సేవలను అందింపజేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా పలు శుభకార్యక్రమాలకు హాజరై నూతన వస్త్రాలను కానుకగా అందించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట స్థానిక నేతలు కీసర శ్రీనివాసరెడ్డి, కీసర సుధాకర్ రెడ్డి, పుచ్చకాయల శంకర్, ఏసురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

దేశ విభజనపై రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలను సమర్థించిన ఫరూఖ్ అబ్దుల్లా!

Drukpadam

ఘర్షణలకు శాశ్వత ముగింపు కావాలంటే.. తొలుత అమిత్ షా ఇల్లు కూల్చాలి: ఆప్

Drukpadam

బీజేపీలో లుకలుకలు …ఈటెల ,రాజగోపాల్ రెడ్డిలు పార్టీ కార్యక్రమాలు దూరం …దూరం …

Drukpadam

Leave a Comment