రాయల సుభాష్ చంద్రబోస్ జీవితాన్ని ప్రజల కోసం త్యాగం చేసి వెలుగులు నింపారు…ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్
-రాజ్యాంగం జీవించే హక్కు ఇచ్చినా ప్రశ్నించే హక్కు ఇవ్వలేదు
-రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవాలి
-మట్టి మనుషులు మేధావులు కలిసి సమాజంలో మార్పులు తీసుకురావాలి
రాయల సుభాష్ చంద్రబోస్ రవన్న అజ్ఞాతవాస జీవితం గడుపుతూ లోకానికి వెలుగులు నింపాలని, సూర్యకిరణాల వలె వెలుగులను ఇచ్చారని అలాంటి త్యాగ పురుషుని మన స్మరించుకోవటం ఆయన మార్గంలో మనం ప్రయాణం చేయడం స్ఫూర్తి దాయకమని మహేంద్ర యూనివర్సిటీ డీన్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఉన్నారు. రాయల సుభాష్ చంద్రబోస్ రవన్న ఆరో వర్ధంతి సందర్భంగా రాయల సుభాష్ చంద్రబోస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం మండలం తెట్టెలపాడు గ్రామంలోజరిగింది
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ” రాజ్యాంగం… ప్రజాస్వామిక విలువలు “అనే అంశంపై ట్రస్ట్ జిల్లా చైర్మన్ గుర్రం అచ్చయ్య అధ్యక్షతన ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ప్రసంగ పాఠం చేశారు. సభా వేదిక మీదికి వక్తలను ట్రస్ట్ కోశాధికారి ఆళ్ల రామారావు ఆహ్వానించారు.భారత రాజ్యాంగం పౌరలకు, వ్యక్తులకు హక్కులను ప్రసాదించిందని అవి జీవించే మాట్లాడే హక్కులను ఇచ్చిందని, ప్రశ్నించే హక్కులను ఇవ్వలేదని, వ్యవస్థలోని లోపాలను ప్రజలు ప్రశ్నించాలని, ప్రజాస్వామిక విలువలను ప్రజలు పెంపొందించుకోవాలని, వాటిని కాపాడుకోవాలని అన్నారు. భారతదేశంలో ఎన్నికల వ్యవస్థలో ప్రజలు ఓటు వేయకుంటే చని పోయినట్లుగా భావించుకోవడం జరుగుతుందని, అలా ఉండకూడదని, ఆధార్ కార్డు ఓటర్ ఐడి కార్డు నమోదు చేసుకుంటే భారతీయుడుగా ఈ దేశ పౌరుడు అని ఎట్లా గుర్తించాలని పౌర సత్వ సవరణ చట్టం అనడం సరైంది కాదని ఆయన అన్నారు. భారతదేశంలో అవినీతిని వ్యక్తిగత వ్యవహారమని చట్టంలో సుప్రీంకోర్టు, కోర్టులు వ్యాఖ్యానించటం సరైంది కాదని అన్నారు. స్త్రీల పైన జరుగుతున్న లైంగిక అత్యాచారాలు కోర్టులలో నిజాలుగా నిరూపించుకోవడమనేది స్త్రీలకు చాలా కష్టమైపోయింది అన్నారు. అత్యాచారాలకు పాల్పడిన దోషులను బాధితురాలు చెప్పిన వాస్తవాల మీద ఆధారపడి నేరస్థులనుశిక్షిం చాల్సిన అవసరం ఉందని అన్నారు. నేడు రాజ్యాంగపరంగా ఉన్న జీవించే హక్కు,మాట్లాడే హక్కు, సభ పెట్టుకునే హక్కు, పౌరసత్వ హక్కులను పరిరక్షించుకోవడానికి ప్రజలు చైతన్యంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాయల సుభాష్ చంద్రబోస్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం స్ఫూర్తితో విద్యార్థి దశ నుండి ప్రజల కోసం, దోపిడీకి వ్యతిరేకంగా, దొరల భూస్వామ్య పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకొన్నారని, అజ్ఞాత జీవితం గడిపారని, త్యాగాలు చేయడం మానవుల బాధ్యతగా గుర్తించారని, ఆ బాధ్యతల కై అంకితమై సమాజ మార్పు కోసం పోరాడి జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు. మట్టి మనుషులు మేధావులు కలిసి సమాజంలో మార్పులు తీసుకురావాలని అన్నారు . అందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇంకా ఈ సభలో సిపిఐ ఎంఎల్ ప్రజా పంధా రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి సాంబశివరావు,సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు,ప్రజా పంథా రాష్ట్ర నాయకులు కేజీ రామచంద్రారెడ్డి,రాయల చంద్రశేఖర్ రాష్ట్ర నాయకురాలు, రవన్న సహచరి రాయల రమక్క,సీ పి ఐ ఎం ఎల్ జిల్లా సీనియర్ నాయకులు,ఇల్లందు మాజీ శాసనసభ్యులు గుమ్మడి నరసయ్య ప్రజాపంథా పార్టీ జిల్లా కార్యదర్శి గోకినేపల్లి వెంకటేశ్వరరావు, రవన్న ట్రస్టు ఆర్గనైజింగ్ సెక్రెటరీ పుసులూరి నరేందర్, రవన్న అనుచరులు వడ్డె ల్లి కృష్ణమూర్తి,ట్రస్ట్ కోశాధికారి ఆళ్ల రామారావు, సభ్యులు రాయల రవికుమార్, “పిండిప్రోలు తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక ఊరు “పుస్తకం రచయిత ఆర్ శివలింగం , సిపిఎం నాయకులు దొండేటి ఆనందరావు, పిండిప్రోలు గ్రామ సర్పంచ్ పార్టీ సీనియర్ నాయకులు రాయల నాగే శ్వర రావు తెట్టెలపాడు సర్పంచ్ పుసులూరి మంజుల తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో రవన్నను,తెలంగాణ సాయుధ పోరాట అమరవీరులను స్మరించుకుంటూ ప్రదర్శనను నిర్వహించారు. గ్రామానికి ముఖద్వారంగా ఉన్న ఏపూరి రంగయ్య స్మారకస్థూపం పై అరుణ పతాకం రాయల చంద్రశేఖర్ ఆవిష్కరించారు. గ్రామం సెంటర్లో ఉన్న తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల స్తూపం మీద సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. హాజరైన ప్రముఖులు స్థూపం మీద పుష్పగుచ్ఛాలు ఉంచి ఘనంగా నివాళులర్పించారు.