Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భూతలానికే తలమానికంగా యాదాద్రి ఆలయం…మంత్రి పువ్వాడ అజయ్ కుమార్!

భూతలానికే తలమానికంగా యాదాద్రి ఆలయం
★ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

దైవ సంకల్పం మేరకు యాదాద్రి ఆలయాన్ని భూతలానికే తలమానికంగా స్వర్ణమయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీర్చిదిద్దారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. సోమవారం జరిగిన ఆలయ మహా కుంభ సంప్రోక్షణ పూజా క్రతువులో మంత్రి దంపతులు పాల్గొన్నారు.

ఆలయ విధులు, భక్తుల సందర్శకుల కోసం సకల సౌకర్యాలు సమకూర్చారని యాదాద్రి నరసింహస్వామి ఆలయం పూర్తిగా రూపాంతరం చెంది నూతన గంభీర సర్వశిలానిర్మిత సువిశాలాలయంగా వెలిసిందన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఏ విఘ్నాలు లేకుండా నిర్నిరోధంగా నృసింహాలయం నిర్మించడం దేశ చరిత్రలోనే ఓ ఉజ్వల ఘట్టంగా మంత్రి అజయ్ అభివర్ణించారు. సామాజిక, ఆధ్యాత్మిక, శిల్పకళ, వాస్తు, ఆగమశాస్ర్తాది విద్యలకు శ్రద్ధా నిబద్ధతలకు యాదాద్రి ఆలయం ఒక విశ్వవిద్యాలయం అన్నారు.

ఈ ఆధునిక యుగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అకుంఠిత దీక్షకు నగ సదృశంగా ఆలయం నిర్మితమైందని చెప్పారు. ఆలయం. ఆగమ శాస్త్ర నియమాలు, శిల్ప కళారీతులు, పర్యాటక సౌందర్యం, విజ్ఞుల అభిప్రాయాలు, ప్రజల మనోభావాలు, భక్తుల సౌకర్యాలు మొదలైన అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి స్వయంగా పదేపదే పర్యటిస్తూ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించారని మంత్రి అజయ్ వివరించారు

1959లో మహాయాగం నిర్వహించి లక్ష్మీదేవి మందిరం, తూర్పు రాజగోపురాలను నిర్మించారని రానురాను పెరుగుతున్న భక్తుల రద్దీకి తగినట్టుగా నాటి పాలకులు యాదగిరి గుట్టపై సౌకర్యాలు ఏర్పాటు చేయలేదన్నారు. ఎంతో మంది ముఖ్యమంత్రులు మారినా ఆలయం అభివృద్ధిని పట్టించుకున్న వారే లేరని పురవీధులు లేని స్వామివారి ఆలయం, సిమెంటుతో నిర్మించిన గోపురాలు, భక్తుల రద్దీ పెరిగితే నిల్చునేందుకు లేని సైతం నిరాదరణకు గురైన ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంకల్పించి పునర్నిర్మాణ పనులు పూర్తి చేశారని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు

Related posts

ఏప్రిల్‌ 2న కొత్త జిల్లాలను ప్రారంభించనున్న సీఎం జగన్‌

Drukpadam

జర్మనీలో తవ్వకాల్లో బయటపడిన 3 వేల ఏళ్లనాటి ఖడ్గం.. ఇప్పటికీ తళతళలాడుతూనే..!

Drukpadam

పోస్ట్ చేసిన వందేళ్ల తర్వాత లెటర్ డెలివరీ!

Drukpadam

Leave a Comment