Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎన్టీఆర్‌పై సీపీఐ నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు!

ఎన్టీఆర్‌పై సీపీఐ నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు!
-వామ‌ప‌క్షాల‌కు ద‌క్కాల్సిన అధికారాన్ని ఎన్టీఆర్ ఎగరేసుకెళ్లారు
-పార్టీల మ‌ధ్య శ‌త్రుత్వం ఉండ‌కూడ‌దు
-జ‌గ‌న్‌కు చంద్ర‌బాబుతో పోలికే లేద‌న్న సీపీఐ నారాయ‌ణ‌
-చంద్ర‌బాబుపై స్నేహాన్ని రైలు ప‌ట్టాల‌తో పోల్చిన వైనం

సిపిఐ నారాయణ మరోసారి తనదైన శైలిలో చంద్రబాబు ఎన్టీఆర్ పై స్పందించారు. టీడీపీ 40 ఏళ్ళ ప్రస్థానాన్ని ప్రస్తాహిస్తూ కమ్యూనిస్ట్ లకు దక్కాల్సిన అధికారాన్ని ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన కొద్దినెలకే ఎగరేసుకొని పోయారని అన్నారు . లేకపోతె కమ్యూనిస్ట్ లదే అధికారం అన్నారు . చంద్రబాబు, జగన్ లపై కూడా ఆయన చేసిన కామెంట్లు ఆశక్తికరంగా ఉన్నాయి.

సీపీఐ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్‌, ప్ర‌స్తుతం ఆ పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడుల‌పై సోమ‌వారం ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. టీడీపీ స్థాపించి 40 ఏళ్లు పూర్తి అవుతున్న నేప‌థ్యంలో మంగ‌ళ‌వారం ఆ పార్టీ భారీ కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టింది. ఈ సంద‌ర్భంగా నాడు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించిన సంద‌ర్బాన్ని,ఇప్ప‌టి రాజ‌కీయాల‌ను ప్ర‌స్తావిస్తూ నారాయ‌ణ ఆస‌క్తికర కామెంట్లు చేశారు.

1983లో కాంగ్రెస్ వ్య‌తిరేక గాలిలో క‌మ్యూనిస్టుల‌కు రావాల్సిన అధికారాన్ని ఎన్టీఆర్ ఎగురేసుకెళ్లారని నారాయ‌ణ చెప్పుకొచ్చారు. ప్ర‌పంచంలోనే త‌క్కువ స‌మ‌యంలో అధికారంలోకి వ‌చ్చింది ఎన్టీఆరేన‌ని కూడా నారాయ‌ణ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు నాయ‌కులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో అర్థం కావ‌డం లేదంటూ ఆయ‌న ప్ర‌స్తుత రాజ‌కీయాల‌పై త‌న అభిప్రాయాన్ని వెల్ల‌డించారు.

ఇక చంద్ర‌బాబుతో త‌న స్నేహాన్ని నారాయ‌ణ త‌న‌దైన శైలిలో వ‌ర్ణించారు. చంద్ర‌బాబుతో త‌న స్నేహం రైలు ప‌ట్టాల వంటిద‌న్న నారాయ‌ణ‌.. రైలు ప‌ట్టాలు ఎప్పుడూ క‌ల‌వ‌వని, విడిపోవని వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం జ‌గ‌న్‌కు చంద్ర‌బాబుతో అస‌లు పోలికే లేద‌ని కూడా నారాయ‌ణ వ్యాఖ్యానించారు. పార్టీల మ‌ధ్య శ‌త్రుత్వం ఉండ‌కూడ‌ద‌ని చెప్పిన నారాయ‌ణ‌… ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ బ‌ల‌పడాల్సిన అవ‌స‌రం ఉందని వెల్ల‌డించారు.

Related posts

ఎమ్మెల్యే మైనంపల్లి ఇంటివద్ద ఉద్రిక్తత.. కోడిగుడ్లతో దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం!

Drukpadam

ఇది ఆరంభం మాత్రమే.. సీఎం కేసీఆర్ కు ఈటల హెచ్చరిక!

Drukpadam

జిల్లాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్క‌డ పోటీ చేసినా స‌రే ఓడిస్తా: వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి!

Drukpadam

Leave a Comment