Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

రాజకీయాలలో ఓపిక అవసరం…. మాజీమంత్రి తుమ్మల!

రాజకీయాలలో ఓపిక అవసరం…. మాజీమంత్రి తుమ్మల!

భాస్కర్ ఇంటికి వెళ్లి పరామర్శ .తనకు నేను ఉన్నానని భరోసా .
తుమ్మల వెంట పలువురు టీఆర్ యస్ నాయకులు .

మనతో ఉండేవారిని ఏవిధంగా ఇబ్బందులు పెడ్తున్నారో ప్రజలందరూ చూస్తున్నారు
పార్టీని బజారున పడేసే ఉద్దేశ్యం మనకు లేదు
అలాంటి వ్యక్తుల పై పార్టీ ఆదేశాలు ఎలా ఉంటాయో చూద్దాం
ఎవ్వరు కవ్వించినా, బాధపెట్టినా, ఇబ్బంది పెట్టినా మీరు ప్రతిఘటించవద్దు … –అలాంటి వ్యక్తులను పట్టించుకోవద్దు
చిల్లర వ్యక్తుల చిల్లర పనులను పట్టించుకుంటే మన పరువు ప్రతిష్ఠలే దిగజారతాయి
ఓపిక పడితే మీరే రాజులు

రాజకీయాల్లో ఓపిక అవసరమని ఎవరు ఎన్ని విధాలుగా కవ్వించినా , ఇబ్బందులు పెట్టిన తొందరపడకుండా మనపని మనం చేసుకుంటుపోవాలని మాజీమంత్రి టీఆర్ యస్ నాయకులూ తుమ్మల నాగేశ్వరరావు అన్నారు .రామన్నపేటకు చెందిన జంగం భాస్కర్ పై సొంతపార్టీ వారే క్షు పెట్టి జైలుకు పంపడంపై స్పందించారు. భాస్కర్ ఇంటికి వెళ్లి పరామర్శించారు .తనకు నేను ఉన్నానని భరోసా ఇచ్చారు . తుమ్మల వెంట పలువురు టీఆర్ యస్ కార్యకర్తలు ఉన్నారు .
సొంతపార్టీ వారే కేసు పెట్టడం ఎక్కడైనా ఉందా? ఇదేమి రాజకీయం తాను మంత్రిగా జిల్లా అభివృద్ధికి పనిచేసినా కానీ ఏనాడూ తనతో విభేదించిన ప్రతిపక్ష పార్టీలవారిపై కూడా కేసులు పెట్టలేదని అన్నారు . తమతో ఉండేవారిని పార్టీలో ఇబ్బందులు పెడుతున్న విషయాలను ప్రజలు గ్రహిస్తున్నారని , పార్టీని బజారున పడేసే ఉద్దేశం మనకు లేదు . ఓపికతో ఉంటున్నాం , అభివృద్ధిపై పోటీపడి ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే హర్షిద్దాం… కానీ ఎలాంటి చీఫ్ పాలిటిక్స్ తో ఏమి సాధిద్దాం అనుకుంటున్నారు . పార్టీ అలాంటివారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూద్దాం …అంతవరకూ ఓపికపడదాం. రానున్న రోజులు కచ్చితంగా మనవే …మనకు మంచిరోజులు వస్తున్నాయని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఎవరు కవ్వించినా ,బాధపెట్టిన మీరు ప్రతిఘటించవద్దు .అసలు అలంటి వ్యక్తులను గురించి పట్టించుకోవద్దని అన్నారు. చిల్లర వ్యక్తుల, చిల్లర పనులు పట్టించుకుంటే మన పరువు ప్రతిష్టలు దిగజారుతాయని అన్నారు .తాను మంత్రిగా పనిచేసిన కాలంలో ఏనాడూ ప్రతిపక్షాల వారిని సైతం ఇబ్బందులకు గురిచేయలేదు . కేసులు అనే మాటలేదుని అన్నారు .

భగవంతుని దయతో జిల్లా సమగ్రాభివృద్ది చేసినా…ఎన్నడూ ప్రతిపక్షం వారిని కూడా కేసులతో ఏనాడు ఇబ్బంది పెట్టలేదు…కాని సొంత పార్టీ లోని వాళ్ళనే ఇలా ఇబ్బందులకు గురిచేసే విధానం వారి విజ్ఞతకే వదిలేద్దాం… కొద్దిరోజుల్లోనే తప్పకుండా మనకు మంచిరోజులు వస్తాయి… నేను మీ తోనే ఉంటా … మీ కష్ఠాలలో పాలు పంచుకుంటా…ఇక ముందు కూడా ప్రజల బాగోగులు, అభివృద్ది, మన ప్రాంత సర్వతోముఖాభివృద్దే మన అభిమతం కావాలి …. ఆ దిశగానే నా పని తీరు ఉంటుందని తెలియచేస్తున్నా…ఈ ఉగాది అందరి జీవితాలలో వెలుగులు నింపాలి…
అందరికీ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు…

Related posts

అచ్చే దిన్ కాదు చచ్చె దిన్…సీఎల్పీ నేత భట్టి

Drukpadam

జనం కరోనా తో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి రాజకీయక్రీడ ఆడుతున్నారు… సీఎల్పీ నేత భట్టి

Drukpadam

మునుగోడులో తెలంగాణ జనసమితి పోటీ ….?అభ్యర్థి పల్లె వినయ్ కుమార్ గౌడ్ …?

Drukpadam

Leave a Comment