Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సీట్ల కోసం కసరత్తు ?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సీట్ల కోసం కసరత్తు ?
-ఒక్క వైరా నియోజకవర్గంలోనే ఆరడజన్ మంది పోటీ
-వచ్చే ఎన్నికలకోసం కసరత్తు ప్రారంభం
-మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3 మాత్రమే జనరల్
-7 రిజర్వడ్ అందులో 5 ఎస్టీ , 2 ఎస్సీ
-గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన 4 గురు టీఆర్ యస్ లోకి జంప్

వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ కి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల వాతావరణం వచ్చింది. కాంగ్రెస్ లో సీట్ల కోసం కసరత్తు ప్రారంభమైంది. గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 సీట్లలో ఆరు గెలిచిన కాంగ్రెస్ కు ఈసారి పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉన్నారా ? అంటే కాంగ్రెస్ టికెట్ కోసం కూడా చాలామంది క్యూ కడుతున్నారని సమాచారం . అన్నిటికన్నా ఎక్కువగా వైరా నియోజకవర్గంలో కాంగ్రెస్ సీట్లు కోసం ఇప్పటికే అరడజను మంది పోటీపడుతున్నారు . ఇల్లందు లో ముగ్గురు నలుగురు , కొత్తగూడెంలో ముగ్గురు, నలుగురు ,పినపాకలో ముగ్గురు , అశ్వారావుపేట లో ముగ్గురు , సత్తుపల్లి కోసం ముగ్గురు పోటీపడుతుండగా , ఖమ్మం ,పాలేరు పై చాలామంది కన్నేసిన అక్కడ టీఆర్ యస్ లో పరిణామాలను బట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఈ రెండు జనరల్ నియోజకవర్గాల్లో పోటీ ఆశక్తికరంగా మారె అవకాశం ఉంది.

టీఆర్ యస్ లో టికెట్ రాకపోతే కొందరు నేతలు కాంగ్రెస్ కు జైకొట్టే అవకాశం లేకపోలేదు. కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ యస్ లో టికెట్ మాదంటే మాదేనని సవాళ్లు విసురుకుంటున్నారు . ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వాటిలో కేవలం మూడు నియోజకవర్గాలు మాత్రమే జనరల్ గా ఉన్నాయి. వీటిలో కూడా రెండు ఖమ్మం జిల్లాలో ఉండగా ఒకటి మాత్రమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంది. దీంతో జనరల్ లో పోటీచేసే వారు ఎక్కువగా ఉండటం సీట్లు తక్కువగా ఉండటంతో పార్టీలకు ఇబ్బందిగా మారింది.

2023 లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇందుకోసం పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. కాంగ్రెస్ కూడా దీనిపై కసరత్తు ప్రారంభించింది. జిల్లాలో పోటీచేసే అభ్యర్థుల వివరాలు సేకరిస్తుంది. ఎవరిని పెడితే ఎలా ఉంటుంది అనేదానిపై ఆరా తీస్తుంది. నియోజకవర్గాలవారీగా ఉన్న అభ్యర్థులు , వారికీ ప్రజల్లో ఉన్న పలుకుబడి ,సామజిక సమీకరణాలపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం . పార్లమెంట్ ,అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయా ? లేక షడ్యూల్ ప్రకారం ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తరువాత పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయా ? అనేది ఎన్నికల కమిషన్ తీసుకునే నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది.

గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఉన్న 10 సీట్లలో టీఆర్ యస్ కేవలం ఒక్కసీటు మాత్రమే గెలిచింది. మిగతా 9 లో ఆరు కాంగ్రెస్ , రెండు టీడీపీ , ఒకటి ఇండిపెండెంట్ లు గెలిచారు . రాష్ట్రమంతా టీఆర్ యస్ గాలివీచినా ఖమ్మం లో మాత్రం మిత్రపక్షాలు ఘనవిజయం సాధించాయి. గెలిచినవారిలో ఒక ఇండిపెండెంట్ ,4 గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ యస్ లోకి జంప్ అయ్యారు . జంప్ అయినా వారికీ తిరిగి కేసీఆర్ టికెట్స్ ఇస్తారా ? లేదా అనే సందేహాలు ఉన్నాయి. కేసీఆర్ అందరికి టికెట్స్ ఇస్తానని చెప్పడం సిట్టింగ్ లకు ఊరట నిచ్చే విషయం . అయితే కేసీఆర్ మాట నిలబెట్టుకుంటారా? లేదా అనేది బి ఫారాలు ఇస్తేగానీ తెలియదు…అప్పటివరకు చూడాల్సిందే !

 

Related posts

ఇవే నా చివరి ఎన్నికలు.. కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య!

Drukpadam

డీకే శివకుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను తనిఖీ చేసిన ఈసీ అధికారులు..

Drukpadam

లక్ష గొంతుకల పొలికేక …సిపిఐ కొత్తగూడం గర్జన….

Drukpadam

Leave a Comment