Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీ వ్యతిరేక కూటమికి సారథ్యం వహించలేను: శరద్ పవార్ స్పష్టీకరణ!

బీజేపీ వ్యతిరేక కూటమికి సారథ్యం వహించలేను: శరద్ పవార్ స్పష్టీకరణ!
-యూపీఏ చైర్ పర్సన్ కావాలని కూడా అనుకోవడం లేదు
-బీజేపీ వ్యతిరేక కూటమిలో కాంగ్రెస్ పార్టీ అనివార్యం
-ఒకే పార్టీ బలంగా ఉంటే నాయకులు ‘పుతిన్’లా తయారవుతారు

దేశంలో బీజేపీ వ్యతిరేక కూటమిపై చర్చ జరుగుతున్న వేళ రాజకీయకురువృద్దుడు ఎన్సీపీ నేత షరద్ పవార్ చేసినవ్యాఖ్యలు కీలకంగా మారాయి. కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి అసాధ్యం అన్న శరద్ పవార్ కాంగ్రెస్ కు దేశవ్యాపితంగా కార్యకర్తల బలం ఉంది. ప్రాంతీయ పార్టీలు బలమైనవే అయినప్పటికీ అవి అన్ని రాష్ట్రాలలో ఒకేలా లేవని దేశవ్యాపితంగా కూడా కాంగ్రెస్ కు ప్రతిగ్రామం లో సంబంధాలు ఉన్నాయని అన్నారు . యూపీఏ చైర్ పర్సన్ కావాలని కొందరు అంటున్నారు . తాను కూటమిలో ఉంటాను .అదే సందర్భంలో చైర్ పర్సన్ పోస్ట్ అవసరం లేదు . లేకపోయినా కూటమి బలోపేతం అయ్యేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు .

బీజేపీ వ్యతిరేక కూటమి కోసం ప్రతిపక్షాలు ఒక్కటవుతున్న వేళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వ్యతిరేక కూటమికి తాను సారథ్యం వహించలేనని తేల్చి చెప్పారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో నిన్న మీడియాతో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక కూటమి సాధ్యం కాదన్న ఆయన.. యూపీఏ చైర్ పర్సన్ కావాలని కూడా తాను కోరుకోవడం లేదన్నారు. అయితే, కూటమి బలోపేతానికి తనవంతు సాయం అందిస్తానన్నారు.

 

కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో లేకపోవచ్చేమో కానీ, అది అఖిల భారత పార్టీ అని, దేశంలోని ప్రతి గ్రామంలోనూ ఆ పార్టీ కార్యకర్తలు ఉంటారని చెప్పుకొచ్చారు. కాబట్టి బీజేపీపై పోరులో కాంగ్రెస్ పార్టీ అనివార్యమని, దానిని విస్మరించలేమని అన్నారు. అలాగే, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీలానే ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కూడా బలమైనవేనని అన్నారు. దేశంలో ఒకే పార్టీ బలంగా ఉంటే నాయకులు పుతిన్‌లా మారే అవకాశం ఉందని, మన దేశానికి అలాంటి బెడద లేదనే తాను అనుకుంటున్నట్టు శరద్ పవార్ పేర్కొన్నారు.

Related posts

కేంద్రం వడ్లు కొనాల్సిందే …ఖమ్మం వీధుల్లో ఎడ్లబండ్లపై మంత్రి పువ్వాడ ప్రదర్శన!

Drukpadam

హత్ సే హత్ జోడోలో రేవంత్ రెడ్డి పాట్లు…పొలంలోకి దిగి కూలీలతో నాట్లు …

Drukpadam

రేపే మహా అసెంబ్లీ లో బల పరీక్ష..!

Drukpadam

Leave a Comment