Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

హైద్రాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారిందా ?

హైద్రాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారిందా ?
రాష్ట్రప్రభుత్వం పట్టీపట్టనట్లుగా వ్యవహరిస్తుందా ?
పెద్దల కళ్లుగప్పి పిల్లలు చెడు అలవాట్లకు బానిసలౌతున్నారా ?
వివిఐపి ల పిల్లలే విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారా ?
బర్తడే పార్టీల పేరుతొ పబ్ ల్లో జల్సలు చేస్తున్నారా ?
పుడింగ్స్ అండ్ మింక్ పబ్ లో పెద్దవాళ్ళ పిల్లలను వదిలి ,హోటల్ సిబ్బందిపై కేసులు పెట్టారా?

హైద్రాబాద్ విశ్వనగరం ….ఇప్పుడు డ్రగ్స్ కు కేంద్రంగా కూడా వార్తల్లోకి వెక్కింది…. దీని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలనే పాలకుల ఆత్రుత ఉన్న అందుకు తగ్గట్లుగా మాఫియా , డ్రగ్స్ బానిసలూ , ఉంటారనేది తెలిసిన దాన్ని కంట్రోల్ చేయడంలో ఎందుకో వెనకడుగు వేస్తున్నట్లు అనిపిస్తుంది. అంతకుముందు అనేక మంది సెలబ్రిటీలు డ్రగ్స్ వాడుతున్నారని అనేకమందిని విచారించారు . కానీ అందరు అయ్యగార్లే పచ్చి చేపల బుట్ట ఖాళీ అయినట్టు హైద్రాబాద్ లో డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. ఎవరు వాడుతున్నారని సంగతి మాత్రం పోలీసులకు తెలియదు . తెలిసిన అమాయకులు బలిఅవుతున్నారు తప్ప అసలు దోషులను పట్టుకోవడంలేదు . పట్టుకున్న వారిపలుకుబడికి చట్టాలు చుట్టలౌతున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఇందుకు నిన్న హైద్రాబాద్ లో జరిగిన సంఘటనే ఉదాహరణ …అందునా వివిఐపి ల పిల్లలే విచ్చల విడిగా వ్యవహరిస్తున్నారని,జల్సాలకు అలవాటు పడి ముందుకు బానిసలైన కొందరు అదే పనిగా చెడు అలవాట్లకు బానిసలవుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పబ్ లో దొరికిన వారిని అందరిని వదిలి పెట్టి పొట్టకొట్టి కోసం పబ్ లో పనిచేస్తున్న సిబ్బందిపై కేసులు పెట్టడం విమర్శలకు దారితీస్తుంది.

హైద్రాబాద్ లోని పుడింగ్స్ అండ్ మింక్ పబ్ లో అర్థరాత్రి దాటిన తరువాత కూడా అనేక మంది రాజకీయనేతలు, ఉన్నతాధికారుల పిల్లలు ,సినీ కళాకారులూ , ఇతర వ్యాపార దిగ్గజాల పిల్లలు పట్టుబడం తెలిసిందే . మొత్తం 148 మంది అందులో ఉండగా పోలీసులు రైడ్ చేశారు. అందరిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.అక్కడ కొకైన్ లాంటి నిషేధిత డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించారు. వాటిని పబ్ లో మరో పేర్లతో పిలుస్తారని తెలుసుకున్నారు. వారు డ్రగ్స్ తీసుకున్నారా ? లేదా ? అనే విషయాలు పక్కన పెడితే హీరో నాగబాబు కూతురు హారిక , బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లగంజ్ , బీజేపీ నాయకురాలు ఉప్పల శారదా కుమారుడు , గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు ,సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజాన్ కుమార్ యాదవ్ కుమారుడు , మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి కూతురు , సినీ నటి హేమ పేర్లు బయటకు వచ్చాయి. దీనిపై నాగబాబు , రాహుల్ సిప్లగంజ్ , హేమ స్పందించారు. హేమ అసలు నేను అక్కడకు వెళ్లకపోయినా నా పేరు ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదని అన్నారు . ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు . రేణుక చౌదరి కూతురు పేరు రావడంపై ఆమె ఘాటుగా స్పందించారు. ఆ పబ్ తనకూతురుడని ప్రచారం జరగడం ఆమె పబ్ లో ఉన్నారని వార్తలు రావడంపై ఆమె మండిపడ్డారు . తన కూతురు అక్కడకు వెళ్లలేదని ,ఆ పబ్ కు తన కూతురికి ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు . నిజాలు తెలుసుకోకుండా వార్తలు ప్రసారం చేయడంపై కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు . ఇక ఉప్పల్ శారదా కుమారుడు పబ్ నడుపుతున్నాడని ఆయన్ను అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. శారదా కూడా తన కుమారుడి ప్రమేయాన్ని ఖండించారు .

ఈ పబ్ ఎవరిదీ ? ఎవరు నడుపుతున్నారు ? ఇందులోకి ఎవరెవరు వస్తుంటారు ? ఇందులోకి వెంటర్ కావాలంటేనే యాప్ ద్వారా బుక్ చేసుకొని ఓటీపీ వస్తే దాని నెంబర్ చెప్పి వెళ్లనే నిబంధనలు ఉన్నాయని అంటున్నారు . ఇందులో మెంబర్ షిప్ ఉందని మెంబర్ తో పాటు గూస్ట్ లు రావచ్చునని అంటున్నారు. ఏదైనా ఒక పబ్ అర్థరాత్రి దాటిన తరువాత నడపటం నేరం . అర్థ రాత్రి దాటిన తరువాత మగపిల్లలతో పాటు ఆడపిల్లలు ఉండటం మరో నేరం అందువల్ల నడిపేవారితో పాటు అక్కడ ఉన్నవారందరిపై కేసులు నమోదు చేయాలనీ కొందరు డిమాండ్ చేస్తున్నారు.

 

Related posts

ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వెక్కివెక్కి ఏడ్చిన చంద్రబాబు

Drukpadam

తెలంగాణ టెన్త్ ఫలితాల విడుదల.. 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా టాప్..!

Drukpadam

సింగర్ అవతారమెత్తిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్!

Drukpadam

Leave a Comment