Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వీధి ఒకటే.. నియోజకవర్గాలు, మండలాలు, జిల్లాలు వేర్వేరు.. ఏపీలో వింత!

వీధి ఒకటే.. నియోజకవర్గాలు, మండలాలు, జిల్లాలు వేర్వేరు.. ఏపీలో వింత!
నిన్నటి నుంచి ఏపీలో కొత్త జిల్లాల అమలు
13 జిల్లాల నుంచి 26 జిల్లాలుగా మారిన ఏపీ
వీధిలో ఒక భాగం తూర్పుగోదావరి, రెండో భాగం ఏలూరు జిల్లాలోకి

 

ఆంధ్రప్రదేశ్‌లో అమల్లోకి వచ్చిన కొత్త జిల్లాల్లో పలు వింతలు చోటుచేసుకుంటున్నాయి. అనేక జిల్లాలలో సరిహద్దులు ,గ్రామాలు ,మండలాలు వేరువేరు జిల్లాలోకి మారిపోయాయి. అంతవరకూ బాగానే ఉన్న ఒకే వీధిలో రెండు గ్రామాలు , రెండు మండలాలు ఉండటం అవి వేరు వేరు జిల్లాలోకి వెళ్లడం విచిత్రంగా ఉంది.

రాష్ట్రంలో నిన్నటి నుంచి అధికారికంగా 26 జిల్లాలు అమల్లోకి రాగా, ఒకే వీధి ఇప్పుడు రెండు నియోజకవర్గాలు, రెండు మండలాలు, రెండు జిల్లాలకు సరిహద్దుగా మారింది. జిల్లాల పునర్విభజన కారణంగా కొవ్వూరు నియోజక వర్గం తాళ్లపూడి మండలంలోని తాడిపూడి, పోలవరం నియోజక వర్గం గూటాల పంచాయతీ పరిధిలోని మహాలక్ష్మీదేవిపేట గ్రామాలు వేర్వేరు జిల్లాల పరిధిలోకి వెళ్లిపోయాయి.

తాడిపూడిలోని ఓ వీధి కుడివైపు భాగం తూర్పుగోదావరి జిల్లాలోకి వెళ్లగా, ఎడమవైపున ఉన్న మహాలక్ష్మీదేవిపేట ఏలూరు జిల్లాలోకి వెళ్లింది. ఫలితంగా ఒకే వీధి ప్రజలు రెండు వేర్వేరు జిల్లాలు, వేర్వేరు మండలాలు, వేర్వేరు నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు అయింది.

Related posts

గుట్టలు దోచుకున్న దొంగల భరతం పడతాం…రఘునాథపాలెం ఎన్నికల సభలో తుమ్మల …

Ram Narayana

మేడారం గిరిజన జాతరకు చురుగ్గా ఏర్పాట్లు…

Drukpadam

రాష్ట్రంలో ఘోరమైన పరిస్థితులు-పిట్టల్లా రాలిపోతున్నారు-CPI ML న్యూడెమోక్రసీ

Drukpadam

Leave a Comment