Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

50 గంటల్లో 350 కిలోమీటర్లు పరుగెత్తిన రాజస్థాన్ యువకుడు… ఎందుకంటే…!

50 గంటల్లో 350 కిలోమీటర్లు పరుగెత్తిన రాజస్థాన్ యువకుడు… ఎందుకంటే…!

  • సికర్ నుంచి ఢిల్లీకి మారథాన్
  • మీడియా దృష్టిని ఆకర్షించిన సురేశ్ భిచార్
  • సైన్యంలో చేరాలన్నది అతడి ఆశయం
  • రెండేళ్లుగా రిక్రూట్ మెంట్లు లేని వైనం
  • వయసు దాటిపోతోందని ఆందోళన

ఇటీవల ప్రదీప్ మెహ్రా అనే కుర్రాడు ఆర్మీలో చేరేందుకు ప్రతి రోజూ రాత్రివేళ మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ లో విధులు ముగిసిన తర్వాత 10 కిలోమీటర్ల మేర పరుగు ప్రాక్టీసు చేయడం తెలిసిందే. ఆ కుర్రాడి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇప్పుడలాంటి వీడియోనే మరొకటి సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. రాజస్థాన్ లోని సికర్ కు చెందిన ఓ యువకుడు 50 గంటల్లో 350 కిలోమీటర్లు పరుగెత్తిన వైనం అచ్చెరువొందిస్తోంది.

24 ఏళ్ల ఆ యువకుడి పేరు సురేశ్ భిచార్. స్వస్థలం రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లా. భారత సైన్యంలో చేరి దేశ సేవ చేయాలన్నది అతడి ఆశయం. రాజస్థాన్ లోని సికర్ నుంచి ఢిల్లీ చేరుకున్న అతడిని మీడియా పలకరించింది. తమ ప్రాంతంలో అనేకమంది సైన్యంలో చేరాలని తపిస్తుంటారని తెలిపాడు.

కానీ, రెండేళ్లుగా రిక్రూట్ మెంట్లు లేవని, తమ ప్రాంతంలో అనేక మంది యువత వయసు దాటిపోతోందని ఆ యువకుడు వెల్లడించాడు. అయితే యువతలో సైన్యం పట్ల ఆసక్తి తరిగిపోకుండా ఉండేందుకు ఇలా మారథాన్ పరుగు చేపట్టినట్టు వివరించాడు.

Related posts

తీవ్ర ఉత్కంఠత రేపుతున్న ఖమ్మం ,నల్లగొండ ,వరంగల్ పట్టభద్రుల కౌంటింగ్

Drukpadam

బంగాళాఖాతంలో వాయుగుండం… కోస్తాంధ్రకు అతి భారీ వర్ష సూచన…

Ram Narayana

తెల్లవారుజామున 3 .30 గంటలవరకు కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ!

Ram Narayana

Leave a Comment