Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

సంజయ్ రౌత్ పై ఈడీ చర్య… మౌనంగా ఉన్న ప్రధాని మోడీ …శరద్ పవార్

సంజయ్ రౌత్ పై ఈడీ చర్యను మోదీ దృష్టికి తీసుకెళ్లినప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు: శరద్ పవార్

  • ప్రధాని మోదీతో భేటీ అయిన శరద్ పవార్
  • సుమారు 25 నిమిషాల పాటు కొనసాగిన సమావేశం
  • సంజయ్ రౌత్ పై ఈడీ చర్య అన్యాయమన్న పవార్
ప్రధాని మోదీతో ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఈరోజు భేటీ అయ్యారు. వీరి సమావేశం సుమారు 25 నిమిషాల పాటు కొనసాగింది. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పై ఈడీ తీసుకున్న చర్య చాలా అన్యాయమని అన్నారు. ఆయన కుటుంబానికి సంబంధించిన ఆస్తులను జప్తు చేసిన అంశాన్ని మోదీ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. ఒక కేంద్ర సంస్థ ఇలాంటి చర్య తీసుకుంటే… దానికి వాళ్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే సంజయ్ రౌత్ పై ఈడీ చర్య తీసుకుందని చెప్పారు. రౌత్ పై ఈడీ చర్యను మోదీ దృష్టికి తీసుకెళ్లినప్పడు ఆయన ఏమీ మాట్లాడలేదని అన్నారు.

Related posts

వాస్తవాలు చెప్పకుంటే ముక్కు నెలకు రాసి మూలాన కూర్చోండి -కోదండరాం హెచ్చరిక

Drukpadam

ఈనెల 14 మంచిర్యాల లో కాంగ్రెస్ దీక్ష …పాల్గొననున్న ఖర్గే …మల్లు నందిని !

Drukpadam

వైసీపీకి సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మంచి మాట ….

Drukpadam

Leave a Comment